జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. అనంతరం మీడియా ముందు కంటతడి పెట్టారు శ్రావణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రశ్నించడంతోనే ఎమ్మెల్యే అడుగడుగునా ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పోతున్నానని, మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. డబ్బులు కోసం డిమాండ్ చేసారని, మేము ఇచ్చుకోలేం అని చెప్పామని, దొర అహంకారంతో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక నాపై కక్ష గట్టారన్నారు. అన్ని పనులకు అడ్డొస్తూ చెప్పకుండా ఎలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని హుకుం జారీ చేసాడని, మున్సిపల్ చైర్మన్ పదవి నరక ప్రాయంగా మారిందన్నారు శ్రావణి. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్థావించకూడదు అని హుకుం జారీ చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read : Ram Gopal Varma: పవన్ అభిమాని ఎటకారాలు.. బాగా ఎక్కువయ్యాయే
నరకయాతనకు గురి చేసాడని, ఆశీర్వదిస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటికి వస్తే వేధింపులు ఎక్కువ చేసేవాడని, ఎమ్మెల్యేతో మాకు ఆపద ఉందని ఆమె వ్యాఖ్యానించారు. మా కుటుంబానికి ఏమైనా జరిగితే సంజయ్ కుమార్ కారణం అవుతారని, రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి వేడకున్నారు. నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని, ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళానన్నారు. ఎమ్మెల్యేతో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చిన్నది అంటూ అవమానం చేశారని, స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని ఆమె వెల్లడించారు.
Also Read : Shahrukh Khan: లేడీ గెటప్‌లో షారుఖ్.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన కింగ్ ఖాన్
పార్టీకోసమే పని చేస్తామని పలుసార్లు వేడుకున్న కూడా వినకుండా కక్ష గట్టారని, మమ్మల్ని అణచి వేసి ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే గెలిచారన్నారు. అనేక సార్లు అడిగాం తప్పు ఎక్కడ జరిగింది సర్దుకుంటాం అని అయినా కావాలనే కార్నర్ చేసారని, అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా అంటూ ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.