Nose Pin: ప్రమాదవశాత్తు కోల్‌కతాకు చెందిన 35 ఏళ్ల మహిళ తన శ్వాసతో పాటు ముక్కుపుడకకు ఉండే స్క్రూని పీల్చుకుంది. తనకు తెలియకుండానే ఇది జరిగిందని సదరు మహిళ చెబుతోంది. చివరకు డాక్టర్లు గుర్తించి మహిళకు సర్జరీ చేసి ఊపిరితిత్తుల్లో ఉన్న స్క్రూని బయటకు తీశారు. సీటీ స్కాన్, ఎక్స్-రేలో లంగ్స్‌లో ఉన్న ముక్కుపుడక స్క్రూ స్థానాన్ని గుర్తించి దానిని విజయవంతంగా తొలగించారు. అంతకుముందు ఇలాగే శస్త్రచికిత్స జరిగిన అది విఫలమైంది, చివరకు రెండోసారి సర్జరీ విజయవంతమైంది.
16-17 ఏళ్ల క్రితం తనకు పెళ్లి అయినప్పుడు ముక్కుపుడక ధరించినట్లు 35 ఏల్ల బాధిత మహిల వర్షా సాహు చెప్పారు. తాను స్క్రూని పీల్చుకున్నట్లు తనకు తెలియదని చెప్పారు. ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగిందని, ఆమె దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇది జరిగిటనట్లు వెల్లడించారు. ముందుగా ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన సంగతి తెలియదని, నా కడుపులోకి వెళ్లిందని అనుకున్నానని ఆమె చెప్పారు.
Read Also: Sandeshkhali: సందేశ్‌ఖాలీలో విదేశీ ఆయుధాలు, బాంబులు.. స్వాధీనం చేసుకున్న సీబీఐ..
శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, న్యూమోనియాతో బాధపడుతూ మార్చి నెలలో వైద్యుడి వద్దకు వెల్లినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ముందుగా మందులు వాడినప్పటికీ ఉపశమనం లభించకపోవడంతో వర్షా పల్మనాలజిస్ట్‌ని సంప్రదించాల్సి వచ్చింది. సీటీ స్కాన్ పరిశీలనలో ముక్కుపుడక స్క్రూ ఊపిరితిత్తుల్లో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత ఎక్స్-రే ద్వారా అది ఎక్కడ ఉందో నిర్ధారించుకున్నారు.
కోల్‌కతాలోని మెడికా సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లో పల్మోనాలజిస్ట్ డాక్టర్ దేబ్రాజ్ జాష్, వర్ష ఊపిరితిత్తుల నుండి స్క్రూను తొలగించారు. ఇది అత్యంత అరుదైన కేసుగా వారు పేర్కొన్నారు. కొన్నిసార్లు డ్రైఫ్రూట్స్, తమలపాకులు ప్రజల ఊపరితిత్తుల్లోకి వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల్లో ఇలాంటి చూస్తుంటాం, కానీ 30 ఏళ్ల మహిళ కేసు ఇందుకు మినహాయింపు అని చెప్పారు. స్క్రూ రెండు వారాల పాటు ఆమె లంగ్స్‌లో ఉంది. దాని చుట్టూ కణజాలం పెరిగింది. దీంతో ఈ సర్జరీ సవాలుగా నిలిచిందని వైద్యలు చెప్పారు. శస్త్రచికిత్స విజయవంతమైన తర్వాత నాలుగు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేశారు.