Bandi Sanjay: బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు కార్యకర్తలు లేరని.. ఆ పార్టీ నేత ఫాంహౌస్‌లో పడుకున్నారన్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించే పరిస్థితి లో తెలంగాణ ప్రజలు లేరన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను విడిచే పెట్టే పరిస్థితి లేదన్నారు. సంక్రాంతి మీకు డెడ్ లైన్ రేవంత్ రెడ్డి అంటూ.. మీ నేతలను రోడ్లమీద తిరగనియ్యమని బండి సంజయ్ అన్నారు.
Read Also: Kishan Reddy: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు..
ఉద్యోగాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఇచ్చావా.. ఉద్యోగాలు తీసేసిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్స్‌కి రేవంత్ రెడ్డి తొత్తుగా మారారని.. వారి చేతిలో కీలు బొమ్మగా మారారని ఆరోపించారు. కేబినెట్‌లో కూడా అర్బన్ నక్సల్స్ భావజాలం ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు చేశారు. భాగ్యనగర్‌ను బంగ్లాదేశ్‌గా మార్చే కుట్ర కాంగ్రెస్ చేస్తుందన్నారు. భాగ్యనగర్‌ను బంగ్లాదేశ్ కానివ్వమన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు పగ తీర్చుకుంటారన్నారు. జీహెచ్‌ఎంసీని కైవసం చేసుకుంటామని… బీజేపీతోనే గ్రేటర్ అభివృద్ధి అంటూ బండి సంజయ్ అన్నారు.