Tamil Sai-Annamalai: తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు..
- తమిళి సై.. అన్నామలై గొడవకు శుభం కార్డు
- తమిళిసై ఇంటికి వెళ్లిన అన్నామలై
- ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన తమిళనాడు బీజేపీ చీఫ్
- తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్
- ఇరువురూ కలిసిన ఫొటోను షేర్ చేసిన అన్నామలై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళి సై, అన్నామలై గొడవకు శుభం కార్డు పడింది. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఘోరంగా పరాజయం పాలైన నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఊహాగానాలు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత.. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే తమిళనాడులో పార్టీ మెరుగైన పనితీరు కనబరిచేదని సౌందరరాజన్ అన్నారు. బిజెపి-ఎఐఎడిఎంకె విడిపోవడానికి అన్నామలై కారణమని తమిళి సై ఆరోపించారు.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
య్యి సంవత్సరాలన నాటి మరుగుదొడ్లు ఎలా ఉండేవో తెలుసా? ఈ కోటలో చూడండి..
అయితే.. జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారత్సోవానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. వేదికపైనే తమిళిసై పై సీరియస్ అయినట్లు ఓ వీడియోలో కనిపించింది. అన్నామలైపై ఆమె అన్న మాటలకు షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో తమిళిసై ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారి ఏపీలో హోంమంత్రి అమిత్ షాను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఈరోజు.. సీన్ మొత్తం మారిపోయింది. తమిళిసై ఇంటికి అన్నామలై వెళ్లి మాట్లాడారు. ఈ విషయాన్ని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్వయంగా తెలిపారు. ఇకపై నుంచి.. తమిళిసైతో విభేదాలు ముగిసినట్టేనని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఇరువురూ కలిసిన ఫొటోను అన్నామలై షేర్ చేశారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలకుగానూ 22 స్థానాలను డీఎంకే గెలుచుకోగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది. రాష్ట్రంలో బీజేపీ ఖాతా తెరవలేదు. దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళిసై సౌందరరాజన్, అటు కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన అన్నామలై ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!