Renuka Swami Murder: అమ్మో ఇంత టార్చర్ చేశారా? పోస్ట్‌మార్టంలో దొరికిన దర్శన్ గ్యాంగ్.. డాక్టర్లు ఏం చెప్పారంటే?
- చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి
- తలకు బలమైన గాయం తగలడంతో మృతి
- విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికతో క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renuka Swami Murder Case Postmortem Report: చిత్రదుర్గకు చెందిన రేణుక స్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేయడంతో తలకు బలమైన గాయం తగలడంతో మృతి చెందినట్లు విక్టోరియా ఆస్పత్రి వైద్యుల పోస్టుమార్టం నివేదికలో తేలింది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి, విక్టోరియా ఆస్పత్రి టీం కామాక్షిపాళయ పోలీస్ స్టేషన్‌లో పోస్ట్‌మార్టం పరీక్షపై మౌఖిక నివేదికను సమర్పించింది. అందులో రేణుక స్వామి మరణానికి ముఖ్య కారణం తలకు తగిలిన గాయం అని చెబుతున్నారు. రేణుకాస్వామి మృతదేహంపై గాయాల ఆనవాళ్లు కనిపించాయి. అతని మెదడు, ఛాతీ, చేతులు -కాళ్ళు, మెడ మరియు తలపై గాయాలయ్యాయి. మర్మాంగానికి ప్రాణాంతకమైన దెబ్బ తగిలితే, నొప్పితో గుండెపోటుతో చనిపోయాడని అనుకున్నారు కానీ రేణుకాస్వామి తలకు తగిలిన గాయమే ఆయన మృతికి కారణమని సంబంధిత వర్గాలు ‘కన్నడప్రభ’కు తెలిపాయి. బెంగళూరు రాజరాజేశ్వరి నగర్‌లోని పట్టగెరె షెడ్‌లో రేణుకాస్వామిపై నటుడు దర్శన్ గ్యాంగ్ దాడి చేసింది. ఆ సమయంలో తలపై బలమైన దెబ్బ తగిలిన రక్తం కారలేదు.
Also Read
- Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో 'ఇరుముడి'.. ఆ మార్క్ సాధ్యమేనా?
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
దీంతో రేణుకాస్వామి తలలో రక్తం గడ్డకట్టడంతో మృతి చెందాడు. తుది పోస్టుమార్టం నివేదిక సమర్పించిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నిపుణులు వెరిఫికేషన్ అనంతరం మరణానికి గల కారణాలపై స్పష్టత ఇస్తారని సీనియర్ అధికారులు తెలిపారు. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన సినీ నటుడు దర్శన్ సహా నిందితుల విచారణ బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతోంది. కానీ స్టేషన్ లోపల ఏం జరుగుతుందో తెలియని విధంగా స్టేషన్ చుట్టూ పరదా వేసి స్టేషన్ మొత్తాన్ని దాచి ఉంచారు. దీనిపై పశ్చిమ డివిజన్ డీసీపీ ఎస్.గిరీష్ వివరణ ఇస్తూ.. ‘రేణుకాస్వామి హత్య మామూలు కేసులా కాదు. ఈ కేసు దర్యాప్తులో చాలా ప్రయత్నాలు జరిగాయి. అనేక కోణాల్లో విచారణ జరిపి కేసు పవిత్రతను కాపాడాల్సి ఉంది. కాబట్టి కొన్ని చర్యలు తీసుకొక తప్పడం లేదు, విచారణ విషయం బయటపెట్టలేమని అన్నారు.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!