Mega Family: పవన్ విజయం.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Family Celebrations for Pawan Kalyan Sucess: ఈసారి 2024 లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడి నుంచి వైసీపీకి అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వంగా గీత మధ్య గట్టి పోటీ నెలకొంది. వంగా గీత తరఫున వైసీపీ అగ్ర నేతలు చాలామంది వచ్చి ప్రచారం చేయడమే కాదు వైఎస్ జగన్ కూడా ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ కి మెజారిటీ తగ్గుతుందేమో అనుకుంటే ఆయనకు ఏకంగా 50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వంగా గీత మీద గెలుపొందారు. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు ఖరారు కావడంతో మెగా ఫ్యామిలీ సంబరాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Kangana: భారీ మెజారిటీతో దూసుకుపోతున్న కంగనా
Also Read
కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు 21 సీట్లలో జనసేన పోటీ చేస్తే దాదాపు అన్ని సీట్లలో గెలిచే సూచనలు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో ఈ రోజు వేడుకలు జరగబోతున్నారు. ఈ వేడుకలకు మెగా ఫ్యామిలీ సభ్యులందరూ హాజరవుతారని తెలుస్తోంది. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో విడుదల చేశారు. మరొక పక్క నాగబాబు స్వయంగా ప్రచారంలో పాల్గొనడమే కాదు, జనసేన కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన కౌంటింగ్ ఫలితాలను పిఠాపురం పార్టీ కార్యాలయంలో వీక్షిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకుని మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!