ముచ్చటగా మూడోసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం కమలనాథులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దాదాపు అభ్యర్థుల జాబితాను ప్రకటించేసింది. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజాగా 2024 ఎన్నికల మేనిఫెస్టో కమిటీని బీజేపీ ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మందితో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Mrunal Thakur: చావు భయపెడుతోంది.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా.. కో-కన్వీనర్‌గా పీయూష్ గోయల్‌ను నియమించారు. ఇక కమిటీలో ఆయా రాష్ట్రాల నేతలకు చోటు దక్కింది. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఏ లీడర్‌కు ఛాన్స్ దక్కలేదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిశా, గుజరాత్, అస్సాం, చండీగఢ్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, కేరళ రాష్ట్రాల నేతలకు కమిటీలో చోటు దక్కింది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: “ఈస్ట్ ఇండియా కంపెనీ” దేశం నుంచి తరిమికొట్టబడింది..ఇప్పుడు “వెస్ట్ ఇండియా” కంపెనీ వచ్చింది..
ఇక 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మకు కూడా చోటు దక్కింది.
మరోవైపు కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షా, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, రాష్ట్రంలోని ఇతర పార్టీల నేతలతో కలిసి బీజేపీ తరపున ప్రచారం చేయనుంది. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు కట్టబెట్టాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వికసిత భారత్ కోసం ప్రజలంతా మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే దాదాపుగా అన్ని స్థానాలకు బీజేపీ అభ్యర్థులను వెల్లడించింది. అలాగే అభ్యర్థుల కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: నేను చలాన్ కట్టను, ఎస్పీకి చెప్పండి.. మహిళా ఇన్‌స్పెక్టర్‌తో ఓ వ్యక్తి వాగ్వాదం
ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. ఇక చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. విజయం కోసం అన్ని పార్టీలు సర్వశక్తులా ఒడ్డుతున్నారు.
