రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని వ్యాఖ్యానించారు ఎంపీ కె. లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఫక్తు రాజకీయాలపై దృష్టి సారించారని, అకాల వర్షాలతో రైతులు నష్టపోతే పట్టించుకునే నాథుడే లేడని ఆయన విమర్శించారు. పంచాయతీ సెక్రటరీలను బెదిరించి సమ్మే విరమించాలని ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఉక్కు పాదంతో అణచివేయాలన్నారు. దేశంలో ఎక్కడ బాంబ్ పేలుళ్లు జరిగిన దాని మూలాలు హైదరాబాద్ లో తేలుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ఇది కొత్తది ఏమీ కాదు… గత ప్రభుత్వం కాంగ్రెస్ కూడా దీన్ని ఉపేక్షించింది.
Also Read : Karnataka Elections: కర్ణాటక ఎన్నికల ఓటింగ్ శాతంలో రికార్డ్..1952 తర్వాత ఇదే తొలిసారి..
గతంలో ఓవైసీ స్టీరింగ్ నా చేతిలో ఉందని పదే పదే చెప్పారు. ఓవైసీ మెప్పు కోసమే వీటిని ఉపేక్షిస్తున్నారా? అరెస్ట్ చేయబడ్డ వ్యక్తీ మజ్లిస్ పార్టీకి చెందిన నాయకుడి కాలేజిలో హెచ్‌ఓడీగా పని చేస్తున్నాడు. రాష్ట్ర పోలీసు నిఘా వ్యవస్థ కేవలం ప్రతిపక్ష పార్టీల కదలికలు, అధికార పార్టీ నేతలు ఎవరితో టచ్ లో ఉన్నారన్న దానిపై మాత్రమే పని చేస్తున్నారు. యూపీ, గుజరాత్ లో ఉగ్రవాద కార్యకలాపాలు ఎందుకు ఉండవు అనేది ఆలోచించాలి. పోలీసులకు స్వేచ్ఛ ను ఇవ్వాలి. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున రోహింగ్యాలు మకాం వేశారు. వీరికి కొంత మంది మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇది దేశ భద్రతకు ముప్పు. మేము ఎగ్జిట్స్ పోల్స్ ను కాదు … పీపుల్స్ పల్స్ ను నమ్ముతాం.
Also Read : Bandi Sanjay : కేంద్రం డబ్బులు వాడుకొని తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు
కర్నాటకలో బీజేపీ అధికారంలోకి వస్తాదనే సంపూర్ణ విశ్వాసం ఉంది. గతంలో వీఆర్‌వోలు సమ్మెకు దిగితే వాళ్ళ వ్యవస్థనే రద్దు చేసి వారిని కేసిఆర్ బెదిరించారు. 317 జీవో ద్వారా టీచర్లను అనేక ఇబ్బందుల పాలు చేసారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లు చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చి బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. రైతులను పట్టించుకునే స్థితిలో కేసిఆర్ లేరు. రాష్ట్ర రైతులు కష్టాల్లో ఉంటే.. కేసీఆర్ దేశ రాజకీయాలు అంటూ బయల్దేరారు. అమ్మ పెట్టదు… అడుక్కు తిననివ్వదు అనేలా ఉంది కేసిఆర్ తీరు. రైతుల భీమా కోసం 300కోట్లు చెల్లించే చిత్తశుద్ది ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించి వారిని ఆదుకోవాలి. జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ల సమస్యను పరిష్కరించాలి.’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.