Arundhathi Nair Accident: మలయాళం, తమిళ చిత్రాల ద్వారా ఆ రెండు రాష్ట్రాల కుర్రకారు దృష్టిని ఆకర్షించిన నటి అరుంధతి నాయర్ స్కూటీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మూడు రోజులుగా ఆమె తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతోందని తెలుస్తోంది. అరుంధతి నాయర్ కోవలం సమీపంలో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అరుంధతి గాయాలతో ఆసుపత్రిలో చేరగా ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది. యూట్యూబ్ ఛానల్ షూటింగ్ ముగించుకుని తమ సోదరుడితో కలిసి బెక్‌కి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారిని ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. వారు గాయపడి గంటపాటు రోడ్డుపైనే ఉన్నారు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
Mangli: ఆ పుకార్లు నమ్మకండి.. యాక్సిడెంట్‌పై మంగ్లీ కీలక వ్యాఖ్యలు
ఆమె స్నేహితురాలు, నటి గోపిక అనిల్‌తో సహా పలువురు సోషల్ మీడియా ద్వారా అరుంధతి చికిత్స కోసం సహాయం కోసం అభ్యర్థించడం హాట్ టాపిక్ అవుతోంది. ‘‘నా స్నేహితురాలు అరుంధతి ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. అరుంధతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది, రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించలేనంతగా మారుతున్నాయి. మా వంతు కృషి చేస్తున్నాం, అయితే ప్రస్తుతం ఆసుపత్రి అవసరాలకు సరిపోవడం లేదు. దయచేసి మీరు సాయం చేయగలిగినంత డబ్బు విరాళం ఇవ్వండి, అది ఆమె కుటుంబానికి గొప్ప సహాయం అవుతుంది అంటూ గోపిక అనిల్ పేర్కొన్నారు. ఇక సహాయం చేయమని గోపిక అరుంధతి బ్యాంక్ వివరాలను కూడా షేర్ చేసింది. ఇక అరుంధతి సోదరి ఆర్తీ నాయర్ కూడా మలయాళ సినీ పరిశ్రమలోనే పని చేస్తున్నారు. అరుంధతీ నాయర్ తమిళ చిత్రాల ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టింది. విజయ్ ఆంటోనితో కలిసి చేసిన సైతాన్(తెలుగులో భేతాళుడు) సినిమా ఆమె నటనకు టర్నింగ్ పాయింట్. 2018లో వచ్చిన ఒట్టక్కరు అకవంకన్ చిత్రంతో ఆమె మలయాళంలో అడుగుపెట్టింది. ఇక ఆమె మొత్తంగా పలు మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.