Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adarsha Kutumbam: బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించిన స్టార్ హీరో ఒకవైపు.. ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మాటల మాంత్రికుడు మరోవైపు.. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తోందంటే థియేటర్ల ముందు జాతర జరగాలి, సోషల్ మీడియా రీల్స్‌తో హోరెత్తిపోవాలి.. పైగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌ను గుర్తుచేస్తూ వెంకటేశ్ – త్రివిక్రమ్ ద్వయం చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉండాలో ఊహించుకోవచ్చు. ఆ రేంజ్ క్రేజ్‌తోనే ‘ఆదర్శ కుటుంబం’ అనౌన్స్ అయింది. కానీ కట్ చేస్తే.. రిలీజ్‌కు మరో ఐదారు రోజులు కూడా టైం లేదు, గ్రౌండ్ లెవల్లో చూస్తే మాత్రం అస్సలు జోష్ కనిపించడం లేదు. అసలు ఈ రేంజ్ కాంబో మూవీపై ఇంత సైలెన్స్ ఎందుకనేది ఇప్పుడు ఇండస్ట్రీకే అంతుచిక్కని మిస్టరీగా మారింది. లెక్కప్రకారం గత వారమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ, వారం ఆలస్యంగా ఈ శుక్రవారమే (అక్టోబర్ 9) వెండితెరపైకి వస్తుంది. సాధారణంగా వెంకీ మామా లాంటి పెద్ద హీరో సినిమా వస్తుందంటే వారం రోజుల ముందే టికెట్ బుకింగ్స్, ట్రైలర్ రికార్డులు, కౌంట్‌డౌన్ పోస్టర్లతో రచ్చ రంబోలా జరగాలి. కానీ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో దీనికి విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి వచ్చిన ఒకట్రెండు చిట్చాట్లు మినహా, ఆడియన్స్‌ను కదిలించే ఒక్క పవర్ఫుల్ ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాలేదు. నిజం చెప్పాలంటే, ఈ వారం వెంకీ – త్రివిక్రమ్ సినిమా థియేటర్లలోకి వస్తోందన్న కనీస సమాచారం కూడా రెగ్యులర్ సినీ వీక్షకుల్లో చాలామందికి చేరలేదంటే అతిశయోక్తి కాదు.
ఇక ఈ సినిమా వెనుక ఉన్న మరో కీలక వ్యక్తి నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తన బ్యానర్లో ఓ చిన్న బడ్జెట్ మూవీ వస్తేనే.. పదిహేను రోజుల ముందు నుంచే మైకులు పట్టుకుని, బోల్డ్ కామెంట్లతో ప్రెస్ మీట్లను హీటెక్కించే అగ్రెసివ్ ప్రొడ్యూసర్ ఆయన. అలాంటి నాగవంశీ, ఇంతటి భారీ క్రేజీ కాంబో చేతిలో ఉన్నా ప్రమోషన్లలో ఎందుకు యాక్టివ్‌గా లేరనేది పెద్ద ప్రశ్నగా మారింది. మేకర్స్ కావాలనే ఇలాంటి లో-ప్రొఫైల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా, లేక ప్రమోట్ చేయడానికి తగిన బజ్ మెటీరియల్ దొరక్క చేతులెత్తేశారా అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ డెడ్ సైలెన్స్‌కు తోడు సోషల్ మీడియాలో మరో రూమర్ మరింత ఆజ్యం పోస్తోంది. ఇటీవల కోలీవుడ్‌లో హిట్ కొట్టిన ‘బ్లాస్ట్’ మూవీ లైన్‌తో ‘ఆదర్శ కుటుంబం’ నడుస్తుందనే ప్రచారం సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఎక్కువగా పెడితే ఆ రీమేక్ పోలికలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే చిత్ర యూనిట్ ప్రమోషన్లను లైట్ తీసుకుంటోందా అనే అనుమానాలు ఫ్యాన్స్‌లో బలపడుతున్నాయి. రూ.300 కోట్ల హీరో, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కలిసి చేసిన మూవీ ఇలా బజ్ లేకుండా రావడం రిస్క్ అనే చెప్పాలని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి సైలెంట్‌గా వచ్చి థియేటర్లలో ‘మల్లీశ్వరి’ స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తారా లేక ఈ ప్రమోషన్ల లోపం ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందా అన్నది శుక్రవారమే తేలనుంది.
Also Read
- SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. 'వారణాసి' తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
తాజావార్తలు
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!