Site icon NTV Telugu

Telangana Elections Results: కామారెడ్డిలో బీజేపీ ముందంజ.. రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీఆర్ఎస్

Kamareddy

Kamareddy

కామారెడ్డిలో హోరాహోరీ పోరు జరుగుతుంది. కామారెడ్డిలో 14వ రౌండ్‌ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ముందంజలోకి వచ్చారు.. రెండో స్థానంలో రేవంత్‌రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్‌ కొనసాగుతున్నారు.

Brothers Victory: అక్కడ వివేక్ బ్రదర్స్, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్.. కాంగ్రెస్ నేతల భారీ విజయం..

కాగా.. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో అందరి దృష్టి ఈ సీటుపై ఉంది. ఇక్కడి నుంచి ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో విజయం సాధిస్తారనే వాదన మొదటి నుంచి ఉంది. అందుకు తగినట్లుగానే కేసీఆర్ దాదాపు ఏ దశలోనూ ఇక్కడ ముందంజలో కనిపించలేదు. మొదటి పదమూడు రౌండ్లు రేవంత్ లీడ్‌లో నిలిచారు. కానీ పద్నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి 2,100 ఓట్ల ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో రేవంత్ రెడ్డి, మూడోస్థానంలో కేసీఆర్ ఉన్నారు.

Exit mobile version