Lakshmi Parvathi: సినిమా హీరో పవన్.. రియల్ హీరో జగన్.. బాబును ఓడించండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshmi Parvathi: సినిమా హీరో పవన్ కల్యాణ్.. రియల్ హీరో సీఎం వైఎస్ జగన్.. కుప్పంలో చంద్రబాబును ఓడించండి అంటూ పిలుపునిచ్చారు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి.. చిత్తూరు జిల్లా కుప్పంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు వల్ల ఎక్కువగా నష్టపోయింది ఎన్టీయార్ కుటుంబమే అన్నారు. మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను 35 ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు.. కుప్పంలో 35 ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు.. వ్యవస్థను మెనేజ్ చేసి ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. కుప్పం వైపు దేశమంతా చూస్తోందన్న ఆమె.. స్వాతంత్ర్యం కూడా మేమే తెచ్చామని చంద్రబాబు అంటున్నారు.. 25 కేసులను పక్కదారి పట్టించి, న్యాయవ్యవస్థను చంద్రబాబు మోసం చేశారు. చంద్రబాబు కోవర్టులాగా రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, పురుందేశ్వరిలు వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.
Read Also: China : చైనాలో కుప్పకూలిన హైవే.. 19మంది మృతి
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
ఇక, ప్రజలకు మేలు చేయాలనే తెలుగుదేశం పార్టీని ఎన్టీయార్ స్థాపించారన్నారు లక్ష్మీపార్వతి.. చంద్రగిరిలో చిత్తుచిత్తుగా టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు ఓడిపోయారని గుర్తుచేసిన ఆమె.. 1994 ఎన్నికల్లో నేను, నా భర్త ఎన్టీయార్ తిరిగాము, అప్పుడు చంద్రబాబు ఎందుకు రాలేదు..? అని నిలదీశారు. మరోవైపు.. పురుంధేశ్వరి, భువనేశ్వరీ ఈర్ష ద్వేషానికి నా జీవితం, ఎన్టీయార్ జీవితం నాశనం అయిపోయిందన్నారు. లోకేష్ కు కనీసం మాట్లాడడానికి రాదు, అలాంటి వాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు చంద్రబాబు రాష్ట్రానికి ఏమి చేశారు..? అని ప్రశ్నించిన ఆమె.. ఇజ్రాయిల్ టెక్నాలజీ పేరుతో కుప్పంలోని రైతులను చంద్రబాబు మోసం చేశారు.. రాజధాని పేరుతో అమరావతిలోని రైతులకు చెందిన భూములను చంద్రబాబు కొట్టేశారు.. జగన్మోహన్ రెడ్డిని అనేక ఇబ్బందులు పెడుతున్నారు.. కానీ, 98 శాతం హామీలు అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.
Read Also: Madhyapradesh : అన్నంలో మత్తుమందు పెట్టి.. రెండో తరగతి చిన్నారి పై హాస్టల్లో అత్యాచారం
కుప్పంకు హంద్రీనీవా నీటిని జగన్ అందించారని తెలిపారు లక్ష్మీపార్వతి.. చంద్రబాబు అధికార దాహం కోసం తన మామను వెన్నుపోటు పొడిచారు.. చంద్రబాబును అరెస్ట్ చేసి, నిజాలు కక్కించాలన్నారు. కుప్పంలో చంద్రబాబు పై భరత్ గెలుస్తారని చాలా మంది బెట్లు కాస్తున్నారు.. ఒక దొంగను, వెన్నుపోటు దారుడిని కుప్పంలో భరత్ ఓడిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ కు 60 కోట్లు పెట్టు సర్టిఫికెట్లను చంద్రబాబు కొనిచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీయార్ ట్రస్ట్ ను కాజేసావు.. ఎన్టీయార్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఏమీ చేశారు..? అని నిలదీశారు.. ఇక, ఆస్తుల్లో బిల్ గేట్స్ ను దాటిపోవాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు.. నిజమైన విజనరీ నాయకుడు జగన్మోహన్ రెడ్డన్న ఆమె.. కాళ్లు పట్టుకొని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాల పథకాలను కలిపి, కాపీ మానిపేస్టోను ప్రకటించారు.. మేనిఫెస్టోను నెరవేరుస్తామని బీజేపీ నాయకులకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!