Beerla Ilaiah : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేయడం తగదని, కనీసం గవర్నర్ ప్రసంగాన్ని గౌరవించే సంస్కృతి కూడా బీఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుగా అసెంబ్లీకి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రభుత్వ విప్ సూచించారు. ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్…
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా.. పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి…