Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర
- తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ .
- ఎన్నికల కోడ్ సాకుతో రైతు భరోసా పథకాన్ని ఆపేందుకు కుట్ర అంటూ వ్యాఖ్యలు.
- ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే అనుమతి తీసుకుందామని సూచన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar: ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని నిలిపివేయాలని చూస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. పైగా రానున్న ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి వాటిపై ప్రభావం పడే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ మేరకు నేడు (శుక్రవారం) ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read: Parashakthi : ‘పరాశక్తి వివాదం ముగిసింది.. ‘టైటిల్ ఎవరికి దక్కిందంటే..?
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
రైతు భరోసా సహా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇండ్ల నిర్మాణ లబ్దిదారులు వంటి పథకాలను తక్షణమే అమలు చేయాలని.. ఇందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతూ ప్రభుత్వం రైతులకు అందాల్సిన సొమ్మును ఆపడం దారుణమని ఆయన విమర్శించారు. ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తే, అఖిలపక్షం తరఫున కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడానికి అనుమతి తీసుకుందామని సూచించారు. తెలంగాణ రైతులు ఇప్పటికే ఏడాది పాటు రైతు భరోసా నిధులు అందక తీవ్రంగా నష్టపోయారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ నెలలోనైనా నిధులు అందించకపోతే రైతులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పెట్టుబడులు పెరగడం, వర్షాభావ పరిస్థితులు ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ తరుణంలో చేతికి అందే సొమ్మును కూడా నిలిపివేయడం రైతులకు మరో పెద్ద దెబ్బ అవుతుందని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల మంది రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారని, కానీ వీరిలో మొత్తం 40 వేల మందికే మంజూరు చేయడం చాలా తక్కువ అని విమర్శించారు. మిగిలిన 99% పేదలకు రేషన్ కార్డులు ఇవ్వకపోవడం అమానవీయమన్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూమిలేని 10 లక్షల మంది కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎకరాకు రూ.6000 చొప్పున నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ 20,336 మందికే నిధులు జమచేసి మిగిలిన 9.79 లక్షల మందికి ఇవ్వకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఇళ్ల మంజూరు పథకం కింద 70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీరిలో 40 లక్షల మందికి అర్హత లభించినా ఇప్పటి వరకు కేవలం 72,406 మందికే మంజూరుచేయడం అన్యాయమన్నారు. మిగిలిన లబ్దిదారులను తక్షణమే ఎంపిక చేసి వారికి ఇళ్లను మంజూరు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పేదలకు, రైతులకు రావాల్సిన నిధులను ఆపేయడం తీవ్రంగా ఖండించిన బండి సంజయ్, ప్రతి లబ్దిదారుడికి తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు మిగిలిన అన్ని పథకాల అమలును వెంటనే ప్రారంభించాలన్నారు. లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!