Site icon NTV Telugu

Anand Goud : కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదు

Anand Goud Bjp

Anand Goud Bjp

Anand Goud : కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్‌ గౌడ్‌. పండిట్ నెహ్రూ కాక కాలేకర్ కమిషన్ ను అమలు చేయలేదనీ లక్ష్మణ్ చెప్పాడు దీన్ని వెనక్కి తీసుకోవాలా మంత్రి చెప్పాలని, కులం పేరు మీద రిజర్వేషన్లు నెహ్రూ వద్దని చెప్పిన మాటలను వెనక్కి తీసుకోవాలా అని ఆయన వ్యాఖ్యానించారు.

Mohammad Rizwan: టాస్, ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్‌ని- పాక్ కెప్టెన్..

ఇన్ని రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేసిన అన్యాయనికి క్షమాపణ చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేసాడని, ప్రతి ప్రభుత్వం బీసీలకు మంత్రి పదవి ఇచ్చి ఇతరుల ను తిట్టించేందుకు ఉపయోగిస్తున్నారన్నారు ఆనంద్‌ గౌడ్‌. బీసీ మంత్రులు సీఎం ఎది చేపితే అది చేస్తున్నారు.. బీసీ నేతలను తిట్టిస్తున్నారని, ఇప్పటి వరకు బీసీలకు మీరు చేసింది ఏంటో చెప్పండన్నారు. కులగణన ఎందుకు చేస్తున్నారో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్..లక్ష్మణ్ మీద చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకోవాలని ఆయన తెలిపారు.

Jammu Kashmir: విలేజ్ గార్డుల్ని చంపిన టెర్రరిస్టులు ట్రాప్.. కొనసాగుతున్న ఎన్‌కౌంటర్..

Exit mobile version