కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడించాలని నిర్ణయించుకుంది బిజెపి. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర నేతలు కూడా ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ విషయంలో వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణపై దృష్టి పెట్టామని..రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడి నేతలకు బలమైన సంకేతాలు ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోడీ హైదారాబాద్‌కు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ప్రసంగించారు. పార్టీ ముఖ్య నేతలు సైతం తెలంగాణలో రెగ్యులర్‌గా పర్యటిస్తున్నారు.…