Aamani Comments about her divorce: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు. నిజానికి ఎక్కువ సినిమాల్లో మంచి భార్య పాత్రలు పోషించిన ఆమె రియల్ లైఫ్ వైవాహిక బంధం మాత్రం ఎక్కవ కాలం నిలవలేదు. నిజానికి ఆమని లేట్‌గా పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత ఖాజా మోహియుద్దీన్ ని వివాహం చేసుకుంది. నిజానికి వీరిది ప్రేమ పెళ్లి అనుకుంటారు కానీ కాదు, అలా అని పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. ఇద్దరు కలుసుకున్నాక అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక ఆమని సినిమాలకు దూరమైంది. భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక తర్వాత మధ్య మధ్యలో అరకొర సినిమాలు చేస్తూ వచ్చింది.
Salman Khan: సల్మాన్ ఖాన్ కేసులో కీలక పరిమాణం.. పోలీసుల సంచలన నిర్ణయం
భర్త అప్పులపాలు కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆమని డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది, వీరి మధ్య విభేదాలు రావడానికి కూడా అదే కారణం అంటూ జరిగిన ప్రచారం మీద స్పందిస్తూ, అది నిజం కాదని తెలిపింది, అప్పులు తీరిపోయాయని, ఆ సమస్య లేదని తెలిపింది. నాకు సినిమాలంటే ఇష్టం, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరికొకరం సమయం ఇచ్చుకోవడం కష్టం అని భావించి ఒక అండర్ స్టాండింగ్‌తో విడిపోయినట్టు ఆమని వెల్లడించింది. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్టు ఆమె పేర్కొంది. విడిపోయినా ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నామని, కలుస్తామని పేర్కొంది. పిల్లల బాధ్యత నేనే తీసుకుని వారే తన ప్రపంచంలా బతికేస్తున్నట్టు వెల్లడించింది. సినిమాల షూటింగ్‌ల వల్ల వారి పేరెంటింగ్ కాస్త ఇబ్బంది అవుతుందని, కానీ మ్యానేజ్ చేస్తున్నానని తెలిపారు.