Bilawal Bhutto: సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. భారత్‌పై భుట్టో పిచ్చికూతలు..
- భారత్‌పై విరుచుకుపడ్డ బిలావల్ భుట్టో జర్దారీ
- సింధూ నాగరికతకు సంరక్షకులం తామని పిచ్చికూతలు
- సింధూ నదిలో భారతీయుల రక్తం పారుతుందని వ్యాఖ్య
- బహిరంగ సభలో నోరు జారిన బిలావల్ భుట్టో జర్దారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం పాకిస్థాన్‌ను ఆగ్రహానికి గురిచేసిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నాడు. నీటిని ఆపడానికి ప్రయత్నిస్తే భారతదేశం దాని పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని భుట్టో పేర్కొన్నాడు. సింధు నాగరికతకు పాకిస్థాన్ నిజమైన సంరక్షకులం తామే అని.. సింధూ నదిలో నీరు పారకపోతే.. భారతీయుల రక్తం పారుతుందని రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేశాడు. “సింధు నది మనదే అవుతుంది. మన నీరు దాని గుండా ప్రవహిస్తుంది. లేదా వారి(భారత్) రక్తం ప్రవహిస్తుంది” అని భుట్టో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో నోరు జారాడు.
READ MORE: Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు
Also Read
పాకిస్థాన్, భారతదేశం మధ్య ఒక ఒప్పందం ఉందని బిలావల్ భుట్టో అన్నాడు. ఈ ఒప్పందంలో సింధు నది పాకిస్థాన్‌కు చెందుతుందని భారతదేశం పేర్కొందని వెల్లడించాడు. ఈ ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని నేడు మోడీ అంటున్నారని.. దీన్ని ఎవరూ అంగీకరించరన్నారు. పాకిస్థాన్ ప్రజలు అంగీకరించరని.. భారత ప్రజలు కూడా మనపై జరుగుతున్న ఈ దారుణాన్ని సహించరని జోష్యం చెప్పాడు.
READ MORE: Komitreddy Venkat Reddy : కాళేశ్వరం నాణ్యత లోపానికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పవు
ఉగ్రవాద దాడికి భారతదేశం పాకిస్థాన్‌ను నిందించిందని భుట్టో అన్నాడు. కశ్మీర్లో ఉగ్రవాద దాడి జరిగిందని.. తామంతా దాన్ని ఖండించామన్నాడు. పాకిస్థాన్ ఉగ్రవాదంతో బాధపడుతోందని తాము కూడా చెప్పామని.. కానీ భారతదేశం దానికి మమ్మల్ని నిందించడం సరికాదని పేర్కొన్నాడు. మీ జనాభా ఎక్కువ, మీది పెద్ద దేశమైతే, మీరు మీ ఇష్టానుసారం ఏ నిర్ణయమైనా తీసుకుంటారా? అని పిచ్చికూతలు కూశాడు. పాకిస్థాన్ ప్రజలు గర్వంగా, ధైర్యవంతులుగా ఉంటారని.. వారి హక్కులను ఎలా కాపాడుకోవాలో వారికి తెలుసని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
తాజావార్తలు
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!