Constable Bribe: బీహార్‌లో ఓ వింత కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు కానిస్టేబుల్ 34 సంవత్సరాల క్రితం లంచం తీసుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ పోలీసు ఇప్పుడు రిటైరయ్యాడు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ ఈ కేసులో నిందితుడు. సింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ గురువారం ఆదేశించారు. బెయిల్ మంజూరైన తర్వాత సురేష్ ఎప్పుడూ విచారణకు హాజరు కాలేదు.
WhatsApp Update: కొత్తగా కాల్ లింక్ ఫీచర్.. ఎలా ఉపయోగించుకోవాలంటే..
అసలు విషయం ఏంటంటే.. నివేదికల ప్రకారం, ఈ సంఘటన మే 6, 1990 న జరిగింది. అప్పడు బర్హియాలో పోస్ట్ చేయబడిన కానిస్టేబుల్ సురేష్ ప్రసాద్ సింగ్ సహర్సా రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అప్పుడు మహేశ్ ఖుంట్ లో నివాసం ఉంటున్న సీతాదేవిని సిపాయి సింగ్ అడ్డుకున్నాడు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై సీత కూరగాయల మూటను తీసుకువెళుతోంది. కానిస్టేబుల్ సీత చెవిలో ఏదో గుసగుసలాడాడు. ఆ తర్వాత ఆమె తన చీర ముడి నుండి 20 రూపాయలు తీసి, సింగ్ తన జేబులో ఉంచుకున్నాడు. అయితే అప్పటి స్టేషన్ ఇన్‌ఛార్జ్ సింగ్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అలాగే లంచం మొత్తాన్ని కూడా రికవరీ చేశాడు. తక్కువ మొత్తంలో ప్రమేయం ఉన్నప్పటికీ, ఈ కేసు 3 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ కేసులో సింగ్‌కు బెయిల్ మంజూరైంది. అయితే, అతను విచారణకు హాజరు కాలేదు. అతను 1999 నుండి పరారీలో ఉన్నాడు. అతని ఆస్తిని అటాచ్ చేయాలని ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ., అతను తప్పు చిరునామా ఇచ్చాడని తేలింది.
Vikram Rathod: న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా టీమిండియా మాజీ కోచ్..