Car Accident: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ఇద్దరికి గాయాలు
Car Accident: బీహార్‌లో మాధేపురా డీఎం కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫుల్పరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతోంది. డీఎం కారు మాధేపురా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలను కారు ఢీకొట్టింది. ఈ సమయంలో ఓ కూలీ, మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం డీఎం, డ్రైవర్ కారు వదిలి పారిపోయారు. దీంతో ఆగ్రహించిన గుంపు డీఎం కారును ధ్వంసం చేసింది.
Read Also:Dangerous Travel: బస్సు టాప్ పై కూర్చొని విద్యార్థుల ప్రయాణం.. పట్టించుకోని డ్రైవర్, కండక్టర్
Also Read
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే డీఎం, సిబ్బంది బైక్‌పై పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాహనం మొదట మహిళ, బిడ్డను ఢీకొట్టిందని తరువాత NH-57లో పనిచేస్తున్న కార్మికులను ఢీకొట్టిందని ఆయన చెప్పారు. కూలీలు రాజస్థాన్ వాసులు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం దర్భంగా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. ఇందులో 27 ఏళ్ల గురియా దేవి, ఆమె 7 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. డిఎంసిహెచ్‌లో మృతి చెందిన కార్మికుడిని రాజస్థాన్‌కు చెందిన అశోక్ సింగ్‌గా గుర్తించారు.
Read Also:Sandra Venkata Veeraiah: పార్టీలు మారి ఇయ్యాల డైలాగులు కొడుతున్నారు.. తుమ్మల పై సండ్ర ఫైర్….
ప్రమాదం జరిగిన వెంటనే వందలాది మంది గుమిగూడి వాహనాన్ని ధ్వంసం చేసి ఎన్‌హెచ్-57ను అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న వారిని అరెస్ట్ చేయాలని, బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డీఎంను సంప్రదించలేకపోయారు. అయితే డిఎం కార్యాలయంలోనే ఉన్నారని మాధేపురా జిల్లా ప్రజాసంబంధాల అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..
-
MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?
-
Thyroid Health : వారసత్వంగా థైరాయిడ్ సమస్యలు వస్తాయా.? నిపుణులు చెబుతున్న కీలక సూత్రాలు..!
-
Oil Crisis: భారత్‌కు గుడ్ న్యూస్.. చమురు రూటు మార్చిన యూఏఈ..
-
Mukesh Ambani: స్టాక్ మార్కెట్లో రిలయన్స్ లాభాల జోరు.. 3 రోజుల్లోనే రూ.1.35 లక్షల కోట్ల ప్రాఫిట్! ఎలా వచ్చాయో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో