Sircilla: బస్సులో సీటు ఖాళీ లేకపోతే నిలుచోని వెళ్తాము. బస్సుల్లో రద్దీగా ఉన్న బస్సు లోపలే ఉంటాము కనుక ప్రమాదం ఉండదు. అయితే బస్సులో ఖాళీ లేనప్పుడు డోర్ దగ్గర వేలాడుతూ ఎవరైనా కనిపిస్తే వెంటనే ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయడం మనం చూస్తుంటాము. కానీ ఓ ఆర్డినరీ బస్సు టాప్ పైన విద్యార్థులు కూర్చుని ప్రయాణిస్తున్న బస్సు సిబ్బంది పట్టించుకోలేదు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణం నుండి టెక్స్టైల్ పార్కుకు బయలుదేరింది ఓ ఆర్డినరీ బస్సు. కాగా ఈ బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు బస్సు టాప్ పైన ప్రమాదకర రీతిలో కూర్చొని ప్రయాణిస్తున్నారు.
Read also:Sandra Venkata Veeraiah: పార్టీలు మారి ఇయ్యాల డైలాగులు కొడుతున్నారు.. తుమ్మల పై సండ్ర ఫైర్….
విద్యార్థులు అలా బస్సు టాప్ ఎక్కి కూర్చోని ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్, కండక్టర్ అభ్యంతరం తెలపకుండా ప్రయాణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇది గమనించిన స్థానికులు బస్సును ఆపి ఇలా పిల్లలు టాప్ పైన కూర్చుని ప్రయాణిస్తున్న అభ్యంతరం తెలపని డ్రైవర్, అలానే కండక్టర్ ను నిలదీసారు. కాగా పసి పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. అలా బస్సు టాప్ పైన ప్రయాణిస్తే పిల్లల ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా అభ్యంతరం తెలపని డ్రైవర్, కండెక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రమాదకరంగా బస్సు ప్రయాణం చేస్తున్న స్కూల్ విద్యార్థుల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.