Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi Kattu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఇరుముడి’. భక్తి, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోతగా వస్తున్న ఈ చిత్రం అనౌన్స్ అయినప్పటి నుంచే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర మాస్ రాజాకు ఈ సినిమా గ్యారెంటీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోని మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఇరుముడి కట్టు’ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
జూన్ 29వ తేదీన ఉదయం 11:07 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా థీమ్‌ను ఎలివేట్ చేసేలా, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ ఉండబోతుందని టాక్. ఈ చిత్రానికి సంచలన కంపోజర్ జి.వి.ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండటంతో సాంగ్స్ పైన భారీ హైప్ నెలకొంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఈ చిత్రాన్ని 2026, ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
#Irumudi first single #IrumudiKattu out on 29th June at 11.07 AM 🤗🙏🏻 pic.twitter.com/Hb1A5ENnKz
— Ravi Teja (@RaviTeja_offl) June 27, 2026
తాజావార్తలు
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!