Sandra Venkata Veeraiah: ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కోసం చివరి వరకు కష్టపడిన వ్యక్తి అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం జైలుకు కూడా వెళ్లవచ్చని అన్నారు. చంద్రబాబు అరెస్టును కాదనని ఆ నేత.. నేడు టీడీపీ జెండా చూపి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులుగా ఉండి పార్టీలు మారిన వారు ఇప్పుడు టీడీపీని బతికించేందుకు చర్చలు జరుపుతున్నారు. ప్రజల పక్షాన నిలిచే నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేస్తామన్నారు.
Read also: Ayodhya Ram Mandir: అయోధ్యలో పూజారి పదవికి దరఖాస్తులు.. ఇంటర్వ్యూ ప్రశ్నలేంటో తెలుసా ?
అయితే.. ఈ ప్రభుత్వం దేవుడికి ఇచ్చిన మాట తప్పిందని మాజీ మంత్రి తుమ్మల నాగేవ్వరరావు అన్నారు. ఇవాళ చర్లలో కాంగ్రెస్ పార్టీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. సాక్షాత్తు శ్రీ రాముడు కొలువైన ఆలయం అభివృద్ధి పనులు వాగ్దానం అమలు కాలేదన్నారు. గోదావరి వరద బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్యులు ఎన్టీఆర్ రాజకీయ అవకాశం ఇచ్చారని తుమ్మల పేర్కొన్నారు. భద్రాచలం డివిజన్‌లో గిరిజనులు, ఆదివాసుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. అయితే.. భద్రాచలం కరకట్ట హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణంతో నాగరిక అభివృద్ధి వైపు నడిపించానన్నారు. వారిపై నమ్మకం ఉంటే భద్రాచలం ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్యను గెలిపించాలని తుమ్మల కోరారు.
Nirmala Sitharaman: పెట్రోల్ మీద వ్యాట్ వేసింది తెలంగాణ.. కేంద్రం కాదు