Story of Satish Prasad Singh: బీహార్ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే.. జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే బీహార్‌లో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆయన కేవలం 5 రోజులు మాత్రమే సీఎంగా అధికారంలో ఉన్నారు. ఇంతకీ ఎవరు ఆయన..? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం..?
READ MORE: Bahubali vs KantaraChapter1 : బాహుబలి ఎపిక్ కు పోటీగా కాంతార ఇంగ్లీష్ వర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే
జనవరి 28, 1968, బీహార్ చరిత్రలో రాజకీయ మార్పునకు దారితీసిన రోజుగా పరిగణిస్తారు. ఓబీసీ కుటుంబంలో జన్మించిన సతీష్ ప్రసాద్ సింగ్ అధికార పీఠాన్ని అధిష్టించారు. భూమిహార్, రాజ్‌పుత్ వర్గాల నుంచి కోయేరి వర్గానికి చెందిన ఎస్పీ సింగ్‌కు అధికారం బదిలీ కావడం బీహార్‌లో ఇదే మొదటిసారి. అప్పటి నుంచి బీహార్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎస్పీ సింగ్ ముఖ్యమంత్రిగా కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేశారు. రాజకీయ రంగంలో ఇది ఒక ప్రధాన సంఘటనగా మారింది. ఇది బీహార్‌కు ఒక ప్రధాన రాజకీయ మైలురాయిగా పరిగణిస్తారు.
సతీష్ ప్రసాద్ సింగ్ జనవరి 1, 1936న బీహార్ లోని ఖగారియా జిల్లాలో ఒక భూస్వామి కుటుంబంలో జన్మించారు. ఆయన ముంగేర్ జిల్లాలోని డీజే కళాశాలలో చదువుకున్నారు. ఆ సమయంలో తన కుటుంబాన్ని ధిక్కరించి జ్ఞానకళ అనే అమ్మాయిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఇష్టంలేని పెళ్లి చేసుకోవడంతో ఫ్యామిలీకి దూరమయ్యారు. మొదటి నుంచీ ఆయన తిరుగుబాటు ధోరణిని కలిగి ఉండేవారు. సోషలిస్ట్ భావజాలాన్ని నమ్మేవారు. అయితే.. ఆయన వాటా కింద కొంత భూమి వచ్చింది. వివాహం తర్వాత సతీష్ ప్రసాద్ పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. 1962లో భూమి అమ్మి మరీ.. సొంత జిల్లాలోని పర్బట్ట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ.. కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మీదేవి చేతిలో ఓటమి పాలయ్యారు. 1964లో లక్ష్మీదేవి మరణం తర్వాత, ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోనూ పరాజయం చవిచూశారు. 1967లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో సంయుక్త సోషలిస్టు పార్టీ తరఫున సతీష్ ప్రసాద్ విజయకేతనం ఎగురవేశారు.
READ MORE: YS Vivek Murder Case: వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం.. విచారణకు దస్తగిరి, షబానా!
1967లో బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి తొలిసారిగా షాక్ తగిలింది. మెజార్టీ మార్కును ఆ పార్టీ దాటలేకపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. జనసంఘ్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఇతరులు కలిసి ‘సంవిద్’ కూటమిగా ఏర్పాటు అయ్యారు. 13 మంది ఎమ్మెల్యేలు ఉన్న జన్ క్రాంతిదళ్‌కు చెందిన మహామయ ప్రసాద్ సిన్హాను ముఖ్యమంత్రిగా చేయడానికి రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సంయుక్త సోషలిస్ట్ పార్టీ అంగీకరించింది. సంయుక్త సోషలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు కర్పూరి ఠాకూర్‌కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. బీహార్ ఐదో ముఖ్యమంత్రిగా మహామయ ప్రసాద్ ఎన్నికయ్యారు. అనేక కారణాల వల్ల మహామయ ప్రసాద్ ప్రభుత్వం ఏడాది లోపే కుప్పకూలింది. అందుకు ప్రధాన కారణం బీపీ మండల్. ఆయన మహాయమ సర్కర్తల్లో మంత్రి పదవిని కోరుకున్నారు. ఆ పదవి దక్కడపోవడంతో కూటమిలో చీలిక తెచ్చి విజయం సాధించారు. అయితే బీపీ మండల్ మండల్ నిర్ణయాన్ని రామ్ మనోహర్ లోహియా తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మండల్ సంయుక్త సోషలిస్ట్ పార్టీకి గుడ్ బై చెప్పి శోషిత్ దళ్ పార్టీని స్థాపించారు.
మొదటిసారి ఎమ్మెల్యే అయిన సతీష్ ప్రసాద్ సింగ్ ప్రభుత్వ పదవులు సహా కొన్ని నియామకాల విషయంలో ముఖ్యమంత్రి మహామయ ప్రసాద్‌తో గొడవపడ్డారు. జన్ క్రాంతి దళ్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కూటమిలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ అతిపెద్ద పార్టీ అయినప్పటికీ, దాని మాట చెల్లడం లేదని విరుచుకుపడ్డారు. ఆయనతో బీపీ మండల్ కూడా మాటకలిపారు. సతీష్ ప్రసాద్‌కు మద్దతు ఇచ్చారు. మరోవైపు ఈ మొత్తం పరిణామాన్ని బయటి నుంచి గమనిస్తున్న కాంగ్రెస్, చివరకు అధికారంలోకి రావడానికి ఒక మార్గాన్ని కనుగొంది. మహామయ సర్కార్ ప్రభుత్వాన్ని కూల్చివేసే బాధ్యతను బీహార్ మాజీ సీఎం కృష్ణ బల్లభ్ సహాయ్‌కు అప్పగించింది. చివరకు 1968లో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా, మహామయ సర్కారు కూలిపోయింది. కానీ శోషిత్ దళ్‌కు చెందిన బీపీ మండల్ సీఎం పదవికి తన సన్నిహితుడు సతీష్ ప్రసాద్ సింగ్ పేరును ప్రతిపాదించారు. అప్పటికే సతీష్ సంయుక్త సోషలిస్ట్ పార్టీని వీడి శోషిత్ దళ్‌లో చేరిపోయారు. దీంతో సతీష్ ప్రసాద్ సింగ్ బీహార్ ఆరో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓబీసీ వర్గం నుంచి రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. సతీష్ ప్రసాద్ 1968 జనవరి 28 సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 30న ఆయనతో పాటు శోషిత్ దళ్‌కు చెందిన మరో ఇద్దరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. అయితే ఐదు రోజుల్లోనే సతీష్ ప్రసాద్ సీఎం కథ ముగిసింది.
READ MORE: Naga Vamsi : ఆల్రెడీ నెగిటివిటీ ఉంటుందని తెలిసి రవితేజ సినిమా వాయిదా !
1968 జనవరి 30న అప్పటి బీహార్ గవర్నర్ నిత్యానంద్ కనుంగో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించి తిరిగి వస్తుండగా కొంతమంది ఆందోళనకారులు ఆయన కారును చుట్టుముట్టారు. గవర్నర్ కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో వాహనం అద్దం పగిలిపోయింది. పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటన తర్వాత, నిందితులైన విద్యార్థులను అరెస్టు చేయాలని బీపీ మండల్ రాష్ట్ర సీఎస్‌ను ఆదేశించారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న సతీష్ ప్రసాద్ అందుకు అంగీకరించలేదు. దీంతో బీపీ మండల్, సతీష్ మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో కొన్ని రాజకీయ పరిణామాలు జరిగాయి. కాంగ్రెస్ నాయకుడు రామ్ లఖన్ సింగ్ యాదవ్‌తో బీపీ మండల్ చర్చించారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మహేశ్ ప్రసాద్‌తోనూ చర్చలు జరిపారు. ఆ తర్వాత సతీష్ ప్రసాద్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఐదు రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగి బీపీ మండల్‌కు అప్పగించారు. ఇలా ఎస్పీ సింగ్ కేవలం ఐదు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. బీపీ మండల్ ఫిబ్రవరి 1, 1968న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మండల్ పార్లమెంటు ఉభయ సభలలో సభ్యుడు కానందున, ఈ ఐదు పర్యాయాలు ఆయన బీహార్ ఎగువ సభ శాసన మండలికి నామినేట్ చేయవలసి వచ్చింది. పరస్పర ఒప్పందం ద్వారా సతీష్ ప్రసాద్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి సతీష్ ప్రసాద్ సింగ్ 2020 ఏడాది నవంబర్‌లో ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాల వయసులో మృతి చెందారు.