బిగ్ బాస్ సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్ మొత్తాన్ని షేక్ చేసింది. అగ్నిపరీక్ష నుంచి వచ్చి ఈ వరకూ స్ట్రాంగ్‌గా ఆడుతున్న కంటెస్టెంట్స్ కళ్యాణ్, డీమాన్ పవన్ మధ్య భారీ గొడవ జరిగింది. మొదట ఇద్దరికీ మంచి బాండ్ ఉండేది కానీ రీతుతో డీ మాన్ పవన్ క్లోజ్ అవుతుండటంతో కళ్యాణ్ కాస్త దూరమయ్యాడు. డీమాన్ గేమ్‌పై రీతూ ప్రభావం పడుతోందనే భావనతో కళ్యాణ్ వరుసగా వార్నింగ్‌లు ఇచ్చాడు. లాస్ట్ వీక్ రీతు కెప్టెన్సీ కోసం డీమాన్ ముందు వెళ్లడం కళ్యాణ్‌కు నచ్చలేదు. రీతు కూడా అదే విషయం పై కళ్యాణ్‌తో ఘాటుగా వాదనకు దిగింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో కళ్యాణ్ ఎక్కడ రీతు మీదకే వెళ్లాడో, రీతూ కూడా తగ్గకుండా కౌంటర్ ఇస్తూ వాతావరణాన్ని గాటుగా మార్చింది. ఈ సమయంలో డీమాన్ పవన్ కూడా రెచ్చిపోయి కళ్యాణ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆపాలని చెప్పే క్రమంలో డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకున్న క్లిప్ లైవ్‌లో కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూపై హీట్ పెరిగింది.
Also Read : Raju Weds Rambai : “రాజు వెడ్స్ రాంబాయి” OTT అప్‌డేట్ ..!
తర్వాత కళ్యాణ్ కోపంతో అక్కడున్న చెయిర్‌ను తన్నాడు. మొత్తం గొడవ కారణం రీతూ వలన డీమాన్ తన అసలు గేమ్‌కి దూరమవుతున్నాడనే కళ్యాణ్ భావన. అయితే డీమాన్ ఈ మాటలను అంగీకరించకుండా తిరగబడ్డాడు. లైవ్ చూస్తున్న వాళ్ల ప్రకారం ఇద్దరి మధ్య కొట్టుకునే స్థాయి వరకు ఫైట్ జరిగిందని చెప్పినా, ఎపిసోడ్‌లో మాత్రం మెజారిటీ క్లిప్స్‌ను ట్రిమ్ చేసినట్టు తెలుస్తోంది. కేవలం డీమాన్ కళ్యాణ్ మెడ పట్టుకున్న షాట్ మాత్రమే చూపించారు. ఈ విషయం పై ఈ వారం నాగార్జున హౌస్‌లోకి వచ్చాక కళ్యాణ్, డీమాన్ పవన్‌కి కచ్చితంగా క్లాస్ వేయనున్నాడు. మరోవైపు సంజన రీతు, డీమాన్ పై చేసిన కామెంట్స్ కూడా హోస్ట్ దృష్టికి వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి సీజన్ 9 చివరి వారాల్లో ఉన్నంతటి డ్రామా, ఫైట్లు, గేమ్ చేంజింగ్ మూమెంట్స్ జరుగుతుండటంతో ఆడియన్స్ కూడా ఎవరు విన్నర్ మెటీరియల్, ఎవరు సేఫ్ గేమర్ అనేది క్లియర్‌గా గమనిస్తున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో కెప్టెన్ రీతు తప్ప అందరూ నామినేట్ కావడం హౌస్‌లో ఇంకా టెన్షన్ పెంచింది.