Karnataka Sex Scandal Case: కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జాతీయ మహిళా కమిషన్ గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ చెప్పుకొచ్చింది. పోలీసులకు సమాచారం అందించగా.. నిందితులపై బెదిరింపుల కేసు నమోదు చేశారని పేర్కొనింది.
Read Also: Road Accident : అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురు మృతి, 33 మందికి గాయాలు
కాగా, జాతీయ మహిళా కమిషన్ ప్రకటనపై రియాక్టైన మాజీ సీఎం, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తమ పార్టీపై బురద జల్లేందుకు మహిళలతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ కి అనుకూలంగా ప్రకటనలు చేయించకుంటే వ్యభిచారం కేసు పెడతామని సిట్ అధికారులు బాధిత మహిళను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థల అధికారులు బాధితుల ఇంటి దగ్గరకు వెళ్లి బెదిరిస్తున్నారని వెల్లడించారు. ఇక, ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల పెన్‌డ్రైవ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ అధికారుల దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఈ కేసులో జనతాదళ్‌పై అసత్య ప్రచారం చేయాలనేదే ఈ ప్రభుత్వ కుట్రగా కనిపిస్తోందని హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.