కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జాతీయ మహిళా కమిషన్ గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ చెప్పుకొచ్చింది.