NTV Telugu Site icon

ICC Rankings: టీమిండియాకు భారీ షాక్.. వన్డేల్లో నంబర్ వన్‌గా పాకిస్థాన్

Icc Rankings

Icc Rankings

రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. అయితే ఈ విజయం తర్వాత కూడా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరోసారి వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.

Read Also: Crime: ముగ్గురి స్నేహితుల మధ్య గొడవ.. ఒకరు హతం

ఆసియా కప్ సూపర్-4లో అట్టడుగున నిలిచిన పాకిస్థాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా విజయంతో పాకిస్థాన్‌కు ఎంతో మేలు జరిగింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 122 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ఆస్ట్రేలియాను మూడో స్థానానికి నెట్టి పాకిస్థాన్ మరోసారి నంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించింది.

Read Also: Ganesh Chaturthi: గణేశుడికి 69 కిలోల బంగారం, 336 కిలోల వెండితో అలంకరణ

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానంలో ఉంది. భారతదేశం 114.659 ర్యాంకును కలిగి ఉంది. కాగా.. నంబర్ వన్‌లో ఉన్న పాకిస్థాన్ జట్టు 114.889 రేటింగ్‌తో ఉంది. ఆసియా కప్ తర్వాత టీమిండియా సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా భారత జట్టు నంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు. అదే సమయంలో.. ఈ సిరీస్ ద్వారా, ఆస్ట్రేలియా జట్టు కూడా మరోసారి నంబర్ వన్ స్థానానికి చేరుకోవచ్చు.

Read Also: Heavy Rains: ప్రమాదకర స్థాయిలో నర్మదా.. 12 వేల మంది తరలింపు

ఏఏ జట్లు.. ఏఏ స్థానంలో ఉన్నాయంటే..
పాకిస్థాన్ నంబర్ వన్, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు 113 రేటింగ్‌తో మూడో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 106 రేటింగ్‌తో నాలుగో స్థానం, ఇంగ్లండ్ 105 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టులు, టీ20ల్లో భారత్‌ నంబర్‌వన్‌గా నిలవడం గమనార్హం. టీమిండియా టెస్టులో 118, టీ20లో 264 రేటింగ్‌లతో ఉంది.

Show comments