Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Big Guns Face Heat As India Take On Bangladesh In Must Win Match

IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ చావో రేవో.. మనోళ్లు నెగ్గుతారా?

Published Date :December 7, 2022 , 8:53 am
By Mahesh Jakki
IND vs BAN: బంగ్లాదేశ్‌తో భారత్ చావో రేవో.. మనోళ్లు నెగ్గుతారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs BAN: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్‌ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది. ఈ కీలక మ్యాచ్‌ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైతే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్‌ సిరీస్‌ను చేజార్చుకోనుంది. ఈ కీలక పోరులో సత్తా చాటాలని రోహిత్ సేన కోరుకుంటోంది.

భారత్‌ను ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాటింగ్ వైఫల్యాలు వెంటాడుతున్నాయి. స్పిన్నర్లను ఆడటంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. తొలి వన్డేలో బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా బంతితో రాణించి గట్టెక్కేలా కనిపించింది. కానీ గెలుపు ముంగిట బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. ఒక్క వికెట్‌ తీయలేక భారత్ పరాజయాన్ని చవిచూసింది. మెహదీ హసన్‌, ముస్తాఫిజుర్‌ చివరి వికెట్‌కు ఏకంగా 51 పరుగులు జోడించి బంగ్లాను గెలిపించారు. ఆ ఒక్క వికెట్‌ తీయలేకపోవడంలో బౌలర్ల వైఫల్యం నిజమే కానీ.. స్టార్లతో నిండిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బాధ్యత తీసుకోవాల్సివుంది. చివరిగా ధోనీ సారథ్యంలో 2015లో బంగ్లాదేశ్‌లో జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. ఆ సిరీస్‌లో మూడో వన్డేలో మాత్రమే భారత్ నెగ్గింది. ఆ చరిత్ర పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్తపడుతోంది.

Miss India 2023: మిస్ ఇండియా కావాలని భావిస్తున్నారా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా..!!

ఈ కీలక మ్యాచ్‌లోనైనా రోహిత్, కోహ్లీ, శిఖర్ ధావన్‌లు చెలరేగాలని భారత్ ఆశిస్తోంది. టీమిండియా మరింత దూకుడుగా బ్యాటింగ్ చేయడం చాలా అవసరం. తొలి వన్డేలో 25 ఓవర్ల కంటే ఎక్కువ విలువైన డాట్‌ బాల్స్‌ ఆడారు. మరోవైపు బంగ్లాదేశ్‌ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. బౌలింగ్‌లో బలంగా ఉన్న బంగ్లా జట్టుకు.. బ్యాటింగ్‌లో సమస్యలు ఉన్నాయి. దానిని భారత్ ఉపయోగించుకుంటే విజయం సులభమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bangladesh
  • cricket news
  • ind vs ban
  • IND vs BAN 2nd odi
  • india

తాజావార్తలు

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • Athidi Release: ‘అతిథి’ రీ-రిలీజ్.. సాహసోపేతమైన నిర్ణయం, వర్కౌట్ అవుతుందా?

  • Inter Results : ఎల్లుండి ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!

  • Fake Property Sale: ఒక్క ప్రాపర్టీనే 25 మందికి అమ్మేశారు.. వీరి మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

ట్రెండింగ్‌

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions