Miss India 2023: మిస్ ఇండియా కావాలని భావిస్తున్నారా? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండిలా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss India 2023: మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ తరహాలో ఇండియాలో అందమైన మహిళలందరూ మిస్ ఇండియాగా నిలవాలని ఆరాటపడుతుంటారు. మన దేశంలో గత ఆరు దశాబ్దాలుగా అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. ది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎంఐవో) నిర్వహించే ఈ పోటీలకు ఫెమీనా భాగస్వామిగా నిలుస్తోంది. భారత్‌లో ఈ అందాల పోటీలు ఫెమీనా మిస్ ఇండియా పోటీలుగా చలామణి అవుతున్నాయి. ఇప్పటివరకు 58 సార్లు ఈ పోటీలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో 59వ ఫెమీనా మిస్ ఇండియా 2023 పోటీలు మణిపూర్ వేదికగా జరగనున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల అందెగత్తెలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. 2023 సంవత్సరానికి గానూ మిస్ ఇండియా పోటీలకు సంబంధించిన ప్రకటన తాజాగా వెలువడింది.
Read Also: Mahesh Fans on Fire: దర్శకుడు వంశీ పైడిపల్లిపై మహేష్ ఫ్యాన్స్ అలక
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అందమైన మగువలు మిస్ ఇండియా పోటీలలో పాల్గొనే అవకాశముంది. అయితే అంతిమంగా 30 మంది అందగత్తెలతో తుది జాబితా తయారు చేసి ఫెమీనా మిస్ ఇండియా పోటీలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ పోటీలలో పాల్గొనే వారి అర్హతలను ది మిస్ ఇండియా ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ పోటీలలో పాల్గొనే అందాల భామల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. 5.3 అడుగుల ఎత్తు, ఆపైన (హీల్స్ లేకుండా) ఉండాలి. బరువు 51 కేజీలకు మించకూడదు. అవివాహితులై ఉండాలి. ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి ఉండరాదు. గతంలో పెళ్ళి చేసుకుని విడిపోయినా అనర్హులే. ముఖ్యంగా భారతీయులై ఉండాలి. భారత పాస్ పోర్టు కలిగి ఉండాలి. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు కలిగి ఉన్న వారు కేవలం సెకండ్ రన్నరప్ కోసం పోటీ పడేందుకు అర్హులవుతారు. ఆసక్తి ఉన్న వారు www.missindia.com వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..