Bhimaa : భీమా ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ భీమా’. ఈ సినిమాకు ఏ హర్ష దర్శకత్వం వహించారు. కన్నడనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎ హర్ష భీమా సినిమాతో తెలుగులోకి డెబ్యూ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు.భీమా చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భీమా సినిమాలో గోపీచంద్ సరసన మాళవిక శర్మ మరియు ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా చేశారు. అయితే భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లుగా తెలుస్తోంది. వీరితోపాటు సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.తాజాగా మార్చి 8న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భీమా మూవీ థియేటర్లలో విడుదల అయింది.ఇప్పటికే భీమా సినిమాకు ప్రీమియర్ షోలు వేయగా అవి చూసిన సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ భీమాపై పాజిటివ్‌గా స్పందించారు.
భీమా మూవీ గోపీచంద్‌కు కమ్ బ్యాక్ హిట్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు . అంతేకాకుండా భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, దాదాపుగా శివతాండవం చేశాడని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు . చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బీజీఎమ్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.ఇదిలా ఉంటే భీమా సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. అలాగే శాటిలైట్ రైట్స్‌ను బుల్లితెర టీవీ ఛానెల్ స్టార్ మా సొంతం చేసుకుంది. ఓటీటీ అండ్ శాటిలైట్ హక్కులు అన్ని కలిపి మొత్తంగా రూ. 20 కోట్ల వరకు అమ్ముడు పోయినట్లు సమాచారం.అయితే భీమా ఓటీటీ పార్టనర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని సినిమా ఎండ్ టైటిల్ కార్డ్స్ ద్వారా తెలిసింది. ఇకపోతే ఈ ఓటీటీ డీల్ భీమా మూవీ విడుదల కాకముందే జరిగినట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న రూల్ ప్రకారం మూవీ విడుదలైన నెల రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. అంటే భీమా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఎప్రిల్ మొదటి వారం, లేదా రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..