భట్టి విక్రమార్క భద్రాచలం ఎమ్మెల్యే పోదాం వీరయ్యలు ఇరువురు పడవలలో గోదావరిలో పలు గ్రామాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు.. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి వరదల విషయం లో తాము రాజకీయం చేయడానికి రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందని వీటి భద్రాచలం నుంచి ఏజెన్సీ ఏరియాలో నిర్మించిన ప్రాజెక్టుల దగ్గర కరకట్టల నిర్మాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
Also Read : Ukraine: రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తోందా?
భద్రాచలం కి వెయ్యి కోట్లు కరకట్టల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ప్రకటించారని ఇంతవరకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య పలుమార్లు అసెంబ్లీలో భద్రాచలం సమస్యల గురించి, ప్రస్తావించి నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని కనీసం ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలు కూడా ఎమ్మెల్యేకి ఇవ్వలేదని ఆరోపించారు. ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందని దీనివల్ల అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య వచ్చి గ్రామాలు గ్రామాలు మునుగుతున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల అనేక గ్రామాలు ముంపు గురయ్యాని వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని దీనివల్ల ఆ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అది చూడటానికి చూసి చెల్లించిపోయానని, తన పర్యటన ఏది కూడా రాజకీయం కాదని రాజకీయమంతా ప్రభుత్వమే చేస్తుందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Also Read : Health Tips: కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా.. ఈ ఆహారంతో ఉపశమనం..!