Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు
- ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు
- కీచక గురువును చితకబాధిన స్థానికులు
- మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయినా కూడా అబలలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ ట్యూషన్ మాస్టర్ కీచకుడిగా మారాడు. పాఠాలు బోధించాల్సిన వాడు నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలికలు.. తల్లిదండ్రులకు చెప్పడంతో కీచక గురువును చితకబాదారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?
Also Read
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై 'ఈగిల్ ఫోర్స్' ఉక్కుపాదం
విరార్ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకు అని తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో కామాంధుడికి బుద్ధి చెప్పారు. బట్టలు విప్పి చితకబాదారు. చెప్పుల దండ వేసి ఊరేగించారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ పవార్ విలేకరులకు తెలిపారు. ట్యూషన్ టీచర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని ట్యూషన్ మానేయడంతో బయటపడింది. ఇలా పలువురి విద్యార్థినులను టీచర్ వేధించినట్లుగా తెలుస్తోంది. స్థానికులు ట్యూషన్ సెంటర్‌ను ధ్వంసం చేశారు.
ఇది కూడా చదవండి: Condom Use: యూరోపియన్ టీనేజర్లలో తగ్గుతున్న కండోమ్ వాడకం.. డబ్యూహెచ్ఓ ఆందోళన..
40-year-old tuition class owner arrested on charges of molesting a 13-year-old girl inside the class, in Maharashtra's Virar.
The incident happened two weeks back but was reported after the minor narrated her ordeal to her parents and stopped attending classes. The minor said… pic.twitter.com/9dNFSJYzvd
— Vani Mehrotra (@vani_mehrotra) August 29, 2024
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!