Krishna Vamsi: హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్.. కృష్ణవంశీ ఏమన్నాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Vamsi: ఇప్పుడంటే డైరెక్టర్ కృష్ణవంశీ అంటే చాలామంది కుర్రకారుకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు, ఆయన టేకింగ్ కు ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ కూడా ఫిదా అయిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఒక సింధూరం, ఒక ఖడ్గం, ఒక నిన్నే పెళ్లాడతా.. ఇలా చెప్పుకుంటూపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే గతకొంతకాలంగా కృష్ణవంశీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఈ మధ్యనే రంగమార్తాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇకపోతే ఇప్పుడు హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఇదే కథను కృష్ణవంశీ.. అప్పట్లోనే శ్రీ ఆంజనేయం పేరుతో తెరకెక్కించాడు.
నితిన్, ఛార్మీ, అర్జున్ సర్జా నటించిన ఈ సినిమా 2004 లో రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాను వీక్షిణించిన ప్రేక్షకులు కొంతమంది తమకు హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం నచ్చిందని, శ్రీ ఆంజనేయం ప్లాప్ అవ్వడానికి ఛార్మీ ఓవర్ యాక్షన్ కారణమని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక తాజాగా కృష్ణవంశీ ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. హనుమాన్ కన్నా శ్రీ ఆంజనేయం బెటర్ అన్న నెటిజన్ కు కృష్ణవంశీ సమాధానమిస్తూ.. ” ఆడియన్స్ తప్పు చేయరు.. నచ్చలేదు అంటే రీచ్‌బులిటీలో పొరపాటు ఉంది సార్.. అందుకే ఆడియెన్స్‌ని నిందించకండి సార్.. కొన్ని పోర్షన్స్‌లో నేను తప్పు చేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
Audience r never wrong .. they didn’t like it means there was a mistake r problem of reachability .. so dnt blame audience sir .. may b I was wrong AT some portions .. THQ 🙏♥️ God bless https://t.co/RBumH9z4nm
— Krishna Vamsi (@director_kv) February 11, 2024
తాజావార్తలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి