Bhatti Vikramarka : రాష్ట్ర జేడీపీకి సంభందించి జరిగే ఉత్పత్తిలో మీ బంధం అనుబంధం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో ..రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని, సమ్మర్ లో పూర్తి సన్నద్ధంగా ఉన్నాం అని npdcl డిస్కం అధికారులు పేర్కొన్నారన్నారు. రైతులు, పారిశ్రామికవేత్తలు విద్యుత్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర సామాజిక, ఆర్థిక పరిస్థితులు మీకు తెలుసు అని, ఉద్యోగ వ్యవస్థకు అవసరమైన అన్ని సహకారాలు అందిస్తున్నామన్నారు. సుమారు 5వేల మందికి పదోన్నతులు, కొన్నిచోట్ల నూతన నియామకాలు చేపట్టాం,భవిష్యత్ నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేప్పుడు, తగు సిబ్బంది నియామకం చేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం…రైతులు కట్టే డబ్బులను ఆర్థిక శాఖ డిస్కమ్ లకు కట్టుతుందన్నారు భట్టి విక్రమార్క.
Minister Lokesh: క్యాన్సర్ చికిత్సలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రితో కలిసి పనిచేయండి..
అంతేకాకుండా.. ‘గృహజ్యోతికి అవసరమైన నిధులు ప్రతినెలా చెల్లిస్తున్నాం…ఇప్పటి వరకు రూ.1,535 కోట్లు చెల్లించాం. విద్యాశాఖ తరపున కూడా నెల నేలా చేల్లిస్తున్నాం… రూ.15వేల కోట్లు వ్యవసాయ, 200ల ఉచిత విద్యుత్ , విద్యాశాఖలకు సంభందించి ప్రజల తరపున విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నామ్.. విద్యుత్ శాఖ బలంగా ఉండాలి… యాదాద్రిని గత ప్రభుత్వం వదిలిపెట్టడం వల్ల భారం పెరిగిపోయింది… పర్యావరణ అనుమతులు వేగంగా తీసుకొచ్చి…యాదాద్రి యూనిట్ – 2 ప్రారంభించుకున్నాం… కొన్ని హైడల్ ప్రాజెక్ట్ లు కాలిపోతే వదిలిపెట్టారు… నేను స్వయంగా పరిశీలించి…ఆ సమస్యను క్లియర్ చేశా… తెలంగాణా ప్రపంచంతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీ తీసుకొచ్చాం.. తద్వారా భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి…’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Ponnam Prabhakar : రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం