Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka America Tour Updates 2

Bhatti Virkamarka : పరస్పర అభివృద్ధిలో పలుపంచుకుందాం… మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి విక్రమార్క

Published Date :September 27, 2024 , 5:54 pm
By Gogikar Sai Krishna
  • గ్లోబల్ సిటీ హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరండి
  • అమెరికన్ కంపెనీలతో కలిసి తెలంగాణ వ్యాపార బంధాలు మరింత బలోపేతం
  • వినూత్న ఆవిష్కరణలు
  • నిలకడతో కూడిన అభివృద్ధి కి బాటలు వేద్దాం
  • మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
Bhatti Virkamarka : పరస్పర అభివృద్ధిలో పలుపంచుకుందాం… మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో భట్టి విక్రమార్క
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక విద్యుత్, వస్తు ఉత్పత్తిలో ఎంతో ముందు చూపుతో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రం అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అమెరికన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న మైన్ ఎక్స్ పో 2024 అంతర్జాతీయ సదస్సులో ఆయన గురువారం నాడు (సెప్టెంబర్ 26) ప్రపంచ వ్యాప్త వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిథులు, ప్రముఖ అమెరికన్ కంపెనీల ప్రతినిథుల సమావేశాలలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, ముఖ్యంగా తెలంగాణలో దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్ ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యాపారాలు నిర్వహిస్తున్నాయని తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్ గా రూపుదిద్దుకున్నదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపాయాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం కానున్నదని కనుక అమెరికన్ కంపెనీల వారు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ పెట్టుబడులతో తరలిరావాలని పిలుపునిచ్చారు.

  Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..

ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రత్యేకతను వివరిస్తూ ఈ మహానగరం టెక్నాలజీ హబ్ గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఉంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బైలాజికల్-ఇ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో “వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్” గా, ఈ నగరం ప్రపంచ ఖ్యాతి గడిచిందన్నారు. ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏ.ఐ. తో నిర్వహించే పరిశ్రమలు, ఏ.ఐ. అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని, ఈ విభాగాల్లో ఆసక్తిగల, అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్త కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను కూడా వివరించారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన , పారిశ్రామిక విధానాలు రూపొందించడం జరిగిందని, కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి ముఖ్యంగా పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.

Maldives president: అక్టోబర్‌లో భారత్‌లో ముయిజ్జు పర్యటన.. ప్రధాని మోడీతో చర్చలు

హైదరాబాద్ లో ఇప్పటికే ఉన్న అమెరికన్ కంపెనీలకు ఇక్కడ సానుకూల వాతావరణం, నైపుణ్యం గల మానవ వనరులు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని వృద్ధి చేయడానికి, నిలకడగల అభివృద్ధికి దోహదం చేసే సొల్యూషన్స్ కు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ లో నైపుణ్యత గల మానవ వనరులకు కొదవలేదని, పర్యావరణహిత పునరుత్పాదక ఎనర్జీ , గ్రీన్ టెక్నాలజీలకు, సంబంధిత పరిశ్రమలకు అవకాశం మెండుగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తో పాటు ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్, స్పెషల్ సెక్రెటరీ కృష్ణ భాస్కర్ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. మైనెక్స్ 2024 లో గురువారం నాడు (సెప్టెంబర్ 26) ఆయన ఆస్ట్రేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్ ను సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు , ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులను, వాటి పనితీరును పరిశీలించారు. సౌత్ ఆఫ్రికా, స్విజర్లాండ్, గ్యాటిమల వంటి దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు వివరించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • breaking news
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • Tamil Nadu Elections: విజయ్‌తో పొత్తుపై పళనిస్వామి కీలక వ్యాఖ్యలు..

  • Megastar Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది! ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్‌పై మెగా బ్లెస్సింగ్స్..

  • Vizag: ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం.. విశాఖలో సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..

ట్రెండింగ్‌

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions