Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
- సోనియా గాంధీ ఆత్మకథలో 55 తప్పులు.?
- ఆర్ఎస్ఎస్ స్థాపన, రాజ్యసభ ఎన్నికలపై పొరపాట్లు..
- ఇదే సమయంలో కొన్ని అంశాలు దాచిపెట్టినట్లు ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonia Gandhi Memoir: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆత్మకథ ‘‘Belonging: A Journey of Love’’ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పుస్తకంలో ఆమె ఏం చెప్పిందనే అంశంపై సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి కలిగించింది. అయితే, ఈ పుస్తకంలో చాలా వరకు వ్యాఖరణ తప్పులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు ప్రధాన సంఘటలకు సంబంధించిన తేదీలు, సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల ఫలితాలపై పొరపాట్లు ఉన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పుస్తకంలో మొత్తం 55 వాస్తవ, సందర్భ సంబంధిత తప్పులు ఉన్నట్లు తెలిసింది.
ఆర్ఎస్ఎస్ ఏర్పాటు, ఎన్నికలపై తప్పులు..
భారత పార్లమెంటరీ వ్యవస్థను వివరిస్తూ సోనియా గాంధీ కీలకమైన పొరపాట్లు చేశారని నివేదికలు చెబుతున్నాయి. లోక్‌సభ సభ్యుల్ని ప్రజలు ఎన్నుకుంటారని, రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేస్తారని ఆమె రాశారు. వాస్తవానికి రాజ్యసభ సభ్యుల్లో చాలా మందిని రాష్ట్రాల్లోని శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు పరోక్షంగా ఎన్నుకుంటారు. సాహిత్యం, కళలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష సేవలందించిన 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
Also Read
- Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
- Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
- Kulgam Encounter: కుల్గాం దాడి సూత్రధారి లతీఫ్ భట్ హతం.. ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి
- Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
కాంగ్రెస్‌కు భావజాలం ప్రకారం రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపన సంవత్సరాన్ని కూడా తప్పుగా రాశారు. నిజానికి ఆర్ఎస్ఎస్ను డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1925లో నాగ్‌పూర్‌లో స్థాపించారు. సోనియా పుస్తకంలో ఇది 1921గా ఉంది.
ఇదే కాకుండా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అహ్మద్ పటేల్ మరణించిన ఏడాదిని కూడా సోనియా గాంధీ తప్పుగా రాశారు. అహ్మద్ పటేల్ 2020 నవంబర్ 25న మరణిస్తే, పుస్తకంలో ఇది 2022గా ఉంది.
2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీ ఎన్డీఏకు 353 స్థానాలు వచ్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు 336, 2019లో 353 స్థానాలను గెలుచుకుంది.
గుజరాత్ రాజధాని, సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఘటనలు..
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన వివరాలను రాస్తూ సోనియా గాంధీ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌గా పేర్కొన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ 1970లోనే గాంధీనగర్‌ను రాష్ట్ర రాజధానిగా ప్రకటించారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీల దహనం గురించి వివరిస్తూ.. రైలులో నాలుగు బోగీలకు నిప్పంటించారని చెప్పారు. అయితే, 2002 ఫిబ్రవరి 27న గోద్రా వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని S-6 బోగీకి నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది కరసేవకులు మరణించారు.
కార్గిల్ యుద్ధం కాలక్రమంలో తప్పులు..
1999 కార్గిల్ యుద్ధానికి సంబంధించిన వివరాల్లో కూడా పొరపాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ చొరబాటుదారులను లడఖ్‌కు చెందిన గొర్రెల కాపరి తాషి న్యామ్ గ్యాల్ గుర్తించిన సమయంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఆతిథ్యం ఇస్తున్నట్లు రాసి ఉంది. అయితే, వాజ్‌పేయి 1999 ఫిబ్రవరి 20-21 తేదీల్లో పాకిస్తాన్లో పర్యటించారు. తాషి న్యామ్గ్యాల్ చొరబాటుదారుల్ని మే 7న గుర్తించారు. రెండు సంఘటనల మధ్య 2 నెలల తేడా ఉంది. కార్గిల్ యుద్ధంలో పాక్ ఆక్రమించిన ప్రాంతాలను భారత్ సైన్యం ఆక్రమించడానికి 10 నెలలు పట్టిందని సోనియా పేర్కొన్నారు. వాస్తవానికి ఈ యుద్ధం మే 3 నుంచి జూలై 26, 1999 వరకు 84 రోజుల పాటు కొనసాగింది. జూలై 26ను భారత్ కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటాము.
దాచిన విషయాలే వివాదాలు..
సోనియా గాంధీ పూర్తిగా తన ఆత్మకథలో కీలవ విషయాలను వెల్లడించలేదనే భావన కూడా ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ను కుదిపేసిన ‘‘భోఫోర్స్ కుంభకోణం’’, ‘‘భోపాల్ గ్యాస్ ట్రాజెడీ’’ అంశాలను పెద్దగా ప్రస్తావించలేదు. అయోధ్య – బాబ్రీ వివాదం గురించి మాట్లాడుతూ.. బాబ్రీ కూల్చివేతతో కన్నీరు పెట్టుకున్నట్లు చెప్పారు. అయితే, ఢిల్లీ సిక్కు వ్యతిరేఖ అల్లర్ల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పాలన సమయంలో కీలక సంఘటనల్ని ప్రస్తావించలేదనే విమర్శలు ఉన్నాయి. పీవీ నరసింహా రావు, సీతారం కేసరి వంటి కీలక పాత్రల గురించి తక్కువ వివరాలు ఉన్నట్లు విమర్శకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
-
No Flying Zone: విజయవాడలో అమిత్ షా పర్యటన.. కీలక ప్రాంతాల్లో ‘నో ఫ్లైయింగ్ జోన్’ అమలు..
-
Rajat Patidar: 48 బంతుల్లో 135 పరుగులు.. ఆర్సీబీ కెప్టెన్ వీరవిహారం..
-
Veeradhi Veerulu: మాస్ మహారాజా – శ్రీవిష్ణు కాంబో మిస్ అయినట్లేనా? ‘వీరాధి వీరులు’పై పిన్ డ్రాప్ సైలెన్స్!
-
Keerthy Suresh: స్పెషల్ సాంగ్ నుంచి స్టార్ హీరోల దాకా.. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ రేంజ్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!