Crime: రూ.300 కోట్లకు పైగా మోసం చేసి.. సాధువుగా మారిన నిందితుడు.. చివరికీ..
- మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసిన నిందితుడు
- రూ.300 కోట్లకు పైగా దండుకున్న వైనం
- సాధువుగా మారిన నిందితుడు
- ఛేదించి పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వేలాది మందిని మోసం చేసి రూ.300 కోట్లకు పైగా దండుకున్న వ్యక్తిని మధుర నుంచి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సన్యాసి వేషంలో మధురలో తలదాచుకున్నాడు. దీనిపై సమాచారం ఇస్తూ.. తనను గుర్తు పట్టకుండా ఉండేందుకు నిందితుడు సన్యాసి వేషంలో ఇక్కడ తలదాచుకున్నాడని పోలీసులు తెలిపారు. జాతీయా మీడియా కథనం ప్రకారం.. బృందావన్, బీడ్ జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో కృష్ణ బలరామ్ టెంపుల్ సమీపంలో బాబాన్ విశ్వనాథ్ షిండే పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. షిండే
READ MORE: Amit Shah: ఎంఎస్‌పి పూర్తి పేరు తెలుసా..? రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
దాదాపు రూ.300 కోట్ల విలువైన మోసానికి సంబంధించిన పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు. వందలాది మందిని మోసం చేసిన షిండే.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాధువు రూపంలో ఢిల్లీ, అసోం, నేపాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తలదాచుకుని జీవించాడని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సందీప్ కుమార్ సింగ్ తెలిపారు. చివరికి బృందావనంలో దాక్కున్నట్లు దొరికిపోయాడని చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నిందితుడిని అరెస్టు చేసి, మరుసటి రోజు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరిచారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన క్రైమ్ బ్రాంచ్ బృందం మధుర కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ పొందిన తరువాత అతన్ని అరెస్టు చేసింది.
READ MORE:Crime: స్నానం చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష
బీడ్ జిల్లా ఎస్‌ఎస్‌పీ అవినాష్ బర్గల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం షిండేను ఛేదించింది. ఈ బృందంలోని సభ్యుడు సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్‌ఎస్ ముర్కుటే తెలిపిన వివరాల ప్రకారం.. షిండే తమ డిపాజిట్లపై అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసగించి, రాష్ట్ర సహకార బ్యాంకులోని నాలుగు శాఖల్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టేలా చేశాడు. ఇలా చాలా మందిని మోసం చేసి రూ. 300లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. నిందితులు చేసిన మొత్తం మోసంలో దొంగిలించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులు కూడా ఉన్నాయి. మోసం కేసులో నిందితులు 2,000 మందికి పైగా జీవితాలను నాశనం చేశాడు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..