Site icon NTV Telugu

Bhatti Vikramarka: గుడ్‌న్యూస్.. జూన్ 2న రాజీవ్ యువ వికాసం కింద రూ.1000 కోట్లు మంజూరు..!

Mallu Bhatti Vikramarka

Mallu Bhatti Vikramarka

తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. నల్లమల డిక్లరేషన్‌ను తూచా తప్పక పాటించి నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభం భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు.. దేశంలోనే గర్వించదగిన గొప్ప కార్యక్రమమని కొనియాడారు. గత ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకోవడానికి వెళితే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారని.. పురుషులపై పోలీసు కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

READ MORE: Bandi Sanjay: అందాల పోటీలకైతే 300 కోట్లు.. పుష్కరాలకు రూ.35 కోట్లేనా?

రాష్ట్రం అభివృద్ధి చెంద వద్దని, ఫలితాలు ప్రజలకు అందవద్దని నిత్యం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ఒక మాట అన్న, కుట్ర చేసిన అది రాష్ట్ర ప్రజలపై కుట్రగానే భావిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2న గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా 1000 కోట్లు మంజూరు చేయబోతున్నామని తీపి కబురు చెప్పారు. ఇది పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని కాపాడుకోండని పిలుపునిచ్చారు.. ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమే కాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని నల్లమల్ల సాక్షిగా మాట ఇచ్చారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఓ ఉమ్మడి కుటుంబాన్ని, అద్భుతమైన సమాజాన్ని నిర్మించబోతున్నామని తెలిపారు.

READ MORE: AP and Telangana Police: భారీ పేలుళ్లకు కుట్ర.. రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు..

Exit mobile version