తెలంగాణ గడ్డపై దశాబ్దాలుగా ఉన్న దున్నేవాడిదే భూమి నినాదాన్ని ఇందిరా సౌర గిరి జిల్లా వికాసం వంటి పథకాల ద్వారా చట్టాలుగా అమలు చేస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. తెలంగాణ గడ్డపై ఉన్న నినాదాలు చట్టాలుగా మారాలంటే మరో 20 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు.