రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.