బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను నిండా ముంచారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశీలన, అవగాహణకు రివ్యూ నిర్వహించారు భట్టి విక్రమార్క. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ చేతిలో పెడితే అభివృద్ధి చేసిందేమీ లేదని.. అన్ని రంగాలను ఆందోళన కలిగించే దృస్థితికి తెచ్చారని అన్నారు. అంకెలు, సంఖేలు ఆందోళనకరంగా వుందన్నారు. లెక్కలు చూస్తే ఆశ్చర్యకరంగా వుందని, పవర్ సెక్టార్ 81,516 కోట్ల రూపాయలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్నారు. ప్రభుత్వ. నుంచి డిస్కంలకు కట్టాల్సిన బకాయిలు 22 వేల కోట్లు ఉన్నాయని, 11,03,800 కోట్ల రూపాయల అప్పు పడిందన్నారు. మేము వుంటేనే కరెంట్ వుంది అని గత ప్రభుత్వం లెక్కలు చెప్పిందని, రాబోయే కొన్ని తరలను తాకట్టు పెట్టిందన్నారు.
సింగరేణి కి 19431 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. 59,580 కోట్లు పవర్ పర్చెస్ పేరు మీద బకాయి పడిందన్నారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి 7200 కొట్లి ఖర్చు పెట్టారని, పెద్ద మొత్తం లో అప్పులు చేసి కరెంట్ కొన్నాం అని చెప్పారన్నారు భట్టి. ప్రతి డిపార్ట్మెంట్ ను అప్పుల రూపం లో పెట్టిందని, రాష్ట్రాన్ని తీరిక ట్రాక్ మీద పెట్టాలంటే నిబద్దత తో వుండక తప్పదన్నారు. క్షేత్ర స్థాయి లో సమగ్ర సమాచారం తీసుకుంటున్నామన్నారు. ఇవి గాలి కబుర్లు కాదని, సమగ్ర సమాచారము ఇస్తున్నామన్నారు. బాధ్యత కల కాంగ్రెస్ ప్రభుత్వం వుందని, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ పెద్ద బారం.. అయిన భరించక తప్పదన్నారు.