సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ అయ్యారు. ఈ సమాశంలో కోదండరెడ్డి, వీహెచ్, మహేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, మధు యాష్కీ, గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా.. భట్టి కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేయడంతో.. త్వరలోనే కలుద్దాం అని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై చర్చ చేశామని, పీసీసీ కమిటీపై కూడా చర్చ చేశామన్నారు. కమిటీలో అవకాశాలు రాని వారు కలిశారని, సీనియర్ నేతలకు కూడా అవకాశం రాలేదని అన్నారు. సీనియర్ నేతల పేర్లు మిస్ అయ్యాయని, సామాజిక సమతుల్యత లేదు అని కొందరు చెప్పారన్నారు. అన్నిటిని క్రోడీకరించి పార్టీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. జాబితా రూపొందించే విషయంలో పీసీసీ. సీఎల్పీలను కలిపి కసరత్తు చేస్తారని, ఈ సారి అలా జరగలేదని, అది ఠాగూర్ చెప్పాలన్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ అంత చనువుగా చేయివేసి మాట్లాడుతున్నఈ వ్యక్తిని గుర్తుపట్టారా..?
జిల్లాల వారీగా ఎవరినీ తీసుకుంటారు అనేది చెప్పలేదని, నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో నాకు తెలియదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో పీసీసీ.. సీఎల్పీలది సమాన బాధ్యత అన్నారు.. కానీ ఇప్పుడు ఎందుకో నాకు సమాచారం ఇవ్వలేదన్నారు భట్టి. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ.. సీఎల్పీ నేత భట్టితో కేసీఆర్ రైతు వ్యతిరేక అంశాలపై చర్చ చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాలలో చర్చించే అంశాలపై మాట్లాడుకున్నామని, ధరణి తెచ్చి.. రైతులను మోసం చేశారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సీఎస్‌ని కలిశామన్నారు.
Also Read : Drugs Smuggling: ‘పుష్ప’ సీన్‌ను మించి.. పెళ్లి బట్టల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్..!
భూ సర్వేకి కేంద్రం 120 కోట్లు ఇచ్చిందని, ఇప్పటికి ఒక్క ఎకరం కూడా సర్వే చేయలేదు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. పీసీసీకి చెప్పేందుకు ట్రై చేశామన్నారు. పార్టీ నిర్మాణంలో పీసీసీ.. సీఎల్పీ నేతలది పాత్ర అని, సమస్యలు ఉంటే ఇద్దరిని కలుస్తారని, టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా పీసీసీ.. సీఎల్పీని కూడా కలుస్తారన్నారు. పార్టీ నిర్మాణంలో పదవులు రాలేదని కొందరు చెప్పారని, దీనిపై భట్టితో మాట్లాడేందుకు వచ్చామన్నారు. మాది అసంతృప్తుల సమావేశం కాదని ఆయన వెల్లడించారు.