రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఈ వారమే ప్రభాస్ నటించిన హార్రర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే మారుతి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పై అంచనాలు పెంచేయగా.. రాజాసాబ్ 2.O ట్రైలర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇక లేటెస్ట్‌గా ముంబైలో గ్రాండ్ ఈవెంట్‌తో రిలీజ్ అయిన నాచే నాచే సాంగ్ థియేటర్లు తగలబడిపోతాయ్.. అనే హైప్ క్రియేట్ చేసింది. ప్రోమోతోనే సోషల్ మీడియా ఊగిపోగా.. ఫుల్ సాంగ్ వచ్చాక రచ్చ రచ్చ చేస్తున్నారు డార్లింగ్ అభిమానులు.
ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒక ఎత్తైతే.. నాచే నాచే రీమిక్స్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. ప్రభాస్ లుక్, ఆ స్వాగ్, ఆ స్టైల్, ఆ కాస్ట్యూమ్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. ప్రభాస్ వేసిన స్టెప్స్, తమన్ ఇచ్చిన ట్యూన్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. ముఖ్యంగా.. ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్ షో మామూలుగా లేదు. అలాగే.. విజువల్ పరంగాను ఈ సాంగ్ టాప్ నాచ్ అనేలా ఉంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో.. అన్నీ ఈ పాటలో ఉన్నాయి. అసలు సినిమా ఎలా ఉన్నా సరే.. ఈ ఒక్క పాట చాలు అన్నట్టుగా ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ ఫ్యాన్స్‌ను ఉర్రుతులూగిస్తోంది. ఇక ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. క్లైమాక్స్, ఐమ్యాక్స్, మారుతి మ్యాక్స్ అంటూ తమన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీంతో.. సినిమా పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఇంతలా హైప్ ఇస్తున్న రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి.