భారత దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ సంస్థ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ ను కంపెనీ సబ్మిట్ చేసింది. డేటా సేఫ్టీ, ట్రీట్మెంట్ ప్లాన్లపై మరింత సమాచారం ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఎక్స్ ఫర్ట్స్ ప్యానెల్ భారత్ బయోను కోరింది. మరోవైపు ఐసీఎంఆర్ కూడా టీబీ వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
Also Read : Mumbai Crime: ముక్కలుగా నరికి.. కుక్కర్లో ఉడకబెట్టి.. కుక్కలకేశాడు
అయితే.. గతంలో క్షయవ్యాధికి సంబంధించిన కొత్త BCG వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ త్వరలో భారతదేశంలో ప్రారంభమవుతాయని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ మండే తెలిపారు. క్షయవ్యాధి పరిశోధనలో బయోఫిజికల్ మెథడ్స్‌పై డాక్టర్ మాండే ప్రెజెంటేషన్ ఇచ్చారు. సాంకేతికత వైద్యులు- పరిశోధకులకు TBని బాగా అర్థం చేసుకోవడంలో ఎలా సహాయపడింది.. అంటు వ్యాధిని ఎదుర్కోవడానికి మార్గాలను సుగమం చేసింది అని ఆయన వెల్లడించారు.
Also Read : North America: కార్చిచ్చుతో 100 మిలియన్ల మంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు
కేంద్ర ప్రభుత్వం ఊహించిన విధంగా 2025 నాటికి భారతదేశం నుంచి ఈ వ్యాధిని తరిమి కొట్టేందుకు టీబీ వ్యాక్సిన్ మరియు చికిత్స కోసం CSIR పనిచేస్తుందని డాక్టర్ శేఖర్ మండే తెలిపారు. తాము ప్రధానంగా క్షయవ్యాధికి కొత్త మందులపై దృష్టి పెడుతున్నాము అన్నారు. చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్‌క్యులోసిస్ రీసెర్చ్, టీబీకి సంబంధించిన కొత్త బీసీజీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. అయితే తాజాగా.. టీవీ వ్యాక్సిన్ డెవలప్ చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ పర్మిషన్ కోరింది.