Vaccines: టీకాలతో కరోనాకు నిలవురించడంలో సక్సెస్ సాధించిన తర్వాత ఇతర అంటు వ్యాధులను కూడా టీకాలతో అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ టీకా విధానంలో ఈ సంవత్సరం 8 కొత్త వ్యాక్సిన్‌లను పరీక్షించడానికి పర్మిషన్ ఇచ్చింది.
TB vaccine: హైదరాబాద్ బేస్డ్ ప్రముఖ ఫార్మా కంపెనీ భారత్ బయోటెక్ టీబీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టింది. క్షయవ్యాధి నివారణకు ఉద్దేశించబడిని Mtbvac వ్యాక్సిన్ పెద్దలపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన్ రెండు ప్రయోజనాల కోసం అభివృద్ధి చేస్తున్నారు.
భారత దేశంలోనే టీబీ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికి పర్మిషన్ కావాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాని భారత్ బయోటెక్ సంస్థ కోరింది. ఇందుకోసం ఫేజ్1, ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ప్రపోజల్ ను కంపెనీ సబ్మిట్ చేసింది.