Bhagyashri Borse Dance Videos Goes Viral: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్టు 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా కర్నూలులో సోమవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కొరియోగ్రాఫర్ భానుతో కలిసి భాగ్యశ్రీ బోర్సే డాన్స్ చేశారు. మిస్టర్ బచ్చన్ సినిమాలోని ‘రెప్పల్.. డప్పుల్’ సాంగ్‌కు అదిరే స్టెప్స్ వేశారు. భాగ్యశ్రీ తన డ్యాన్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. మంగ్లీ, అనురాగ్ కుల్‌కర్ణి ఆలపించారు.
Also Read: Los Angeles Earthquake: లాస్‌ఏంజిల్స్‌లో భూకంపం!
ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘నల్లంచు తెల్లచీర’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కూడా భాగ్యశ్రీ బోర్సే డాన్స్ ఇరగదీశారు. సినిమా రిలీజ్ ముందే భాగ్యశ్రీ హైలెట్ అయ్యారు. సినిమాలో నటన కూడా బాగుంటే.. టాప్ హీరోయిన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాది బ్యూటీ భాగ్యశ్రీ ఇటీవల వచ్చిన హిందీ సినిమా ‘చందు ఛాంపియన్’లో నటించారు. అంతకుముందు యారియాన్ 2లో నటించారు.