నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్ల తో దూసుకుపోతుంది… ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల ను భగవంత్ కేసరి సినిమా దాటేసింది. ఇంకా వసూళ్లను బాగానే రాబడుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని బాలయ్య మార్క్ యాక్షన్ తో అద్భుతంగా తెరకెక్కించాడు… కాగా, భగవంత్ కేసరి సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..భగవంత్ కేసరి సినిమా నవంబర్ 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రాబోతుందని సమాచారం వచ్చింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..నవంబర్ 23వ తేదీన భగవంత్ కేసరి మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని సమాచారం..ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం భగవంత్ కేసరి చిత్రం థియేటర్లలో మంచి కలెక్షన్లను రాబడుతోంది. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీలో ఉన్నా కూడా మొదటి నుంచి భగవంత్ కేసరి సినిమా తన జోరు చూపిస్తూనే ఉంది. ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావటం తో భారీగా కలిసి వచ్చింది. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించిన తీరుపై ప్రశంసలు వస్తున్నాయి. బాలకృష్ణ యాక్టింగ్ మరియు యాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్లను మూవీ యూనిట్ ఇప్పటికీ కూడా జోరుగా చేస్తోంది. బ్లాక్‍బాస్టర్ షేర్ కా టూర్ పేరుతో సక్సెస్ టూర్ నిర్వహిస్తోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కొన్ని థియేటర్లకు వెళుతూ ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు.భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‍గా నటించారు. శ్రీలీల బాలయ్య కూతురిగా ముఖ్యమైన పాత్ర చేశారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు.. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మించింది.