అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షించారు. తన X (గతంలో ట్విటర్) ఖాతాలో.. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో ‘మెన్ ఇన్ బ్లూ’ అసాధారణమైన విజయాల రికార్డులను నెలకొల్పారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు టీమిండియాకు మద్దతు నిలుస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా.. టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ప్రపంచ కప్ ను తీసుకురావాలని ట్విట్టర్ లో కోరారు.
Read Also: Producer SKN: కూతురి పెళ్లికని దాచిన డబ్బును కొట్టేసిన చెదలు.. ‘బేబీ’ సినిమా నిర్మాత కీలక ప్రకటన
ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియాపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ పార్టీ తదితరులు టీమిండియాకు విషెస్ తెలిపారు.
Read Also: CPI Narayana: బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడైనా ఒక్కటే..
మరోవైపు టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత కోహ్లీ (54) పరుగుల వద్ద ఔట్ కాగానే.. స్కోరు నెమ్మదిగా వెళ్తుంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (58), సూర్యకుమార్ యాదవ్ (1) ఉన్నారు.