అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షించారు. తన X (గతంలో ట్విటర్) ఖాతాలో.. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 'మెన్ ఇన్ బ్లూ' అసాధారణమైన విజయాల రికార్డులను నెలకొల్పారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు టీమిండియాకు మద్దతు నిలుస్తున్నారని తెలిపారు.
గత 10 ఓవర్లు నుంచి టీమిండియాకు ఒక్క బౌండరీ రాలేదు. వెంట వెంటనే 3 వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పుడే బౌండరీలు, సిక్సర్లు వచ్చాయి. దాదాపు గంట నుంచి టీమిండియాకు బౌండరీ రాలేదు. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలమవ్వడంతో నిలకడగా ఆడుతున్నారు. క్రీజులో విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు.
ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు మెన్ ఇన్ బ్లూ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తన X ఖాతాలో.. 140 కోట్ల మంది భారతీయులు టీమిండియా కోసం ఉంటారని తెలిపారు. అంతేకాకుండా.. కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడాస్ఫూర్తిని నిలబెడతారని, బాగా ఆడండి అంటూ ట్వీట్ చేశారు.
ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.